పేదలకు కేంద్రం శుభవార్త.. సొంతింటి కల సాకారం కోసం రూ.1.5 లక్షలు.. తక్కువ వడ్డీకే లోన్!

PMAY-Rs1 5 Lakh Subsidy: కేంద్ర ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

PMAY-Rs1 5 Lakh Subsidy: కేంద్ర ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పేదలు, బడుగు బలహీన వర్గాల వారు ఆర్థికంగా ఎదగడం కోసం.. వారికి నేరుగా ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం.. పేదలకు శుభవార్త చెప్పింది. ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు.. తక్కువ వడ్డీకే లోన్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఇంతకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం దేనికి సంబంధించింది అంటే.. పేద ప్రజల సొంతింటి కల సాకారం కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు కేంద్రం సాయం లేదా సబ్సిడీ అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుని అకౌంట్లోనే జమ చేస్తుంది. ఇటీవల 2024-25 బడ్జెట్‌లో దీనికి సంబంధించి రూ. 10 లక్షల కోట్లు కేటాయించింది. ఈ మొత్తంతో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

అర్హులు ఎవరంటే..

ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారికి, ఎస్సీ, ఎస్టీ, వితంతు, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు సహా సమాజంలో వెనుకబడిన, అట్టుడుగు వర్గాల వారికి ఈ స్కీమ్ ఎంతో మేలు చేయనుంది. ఈ పథకం కింద వీధి వ్యాపారులు, చేతి వృత్తుల వారు, అంగన్ వాడీ వర్కర్స్ వంటి వారికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఇప్పటికే సొంత ఇల్లు ఉన్న వారికి స్కీమ్ వర్తించదు. ఇక ఈ పథకంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పొచ్చు. వారే యజమానులుగా ఉంటే త్వరగా ఆమోదం లభిస్తుంది.

ఈ పథకం కోసం అప్లై చేసుకునే వారు కచ్చితంగా భారతీయులై ఉండాలి. ఇక లబ్ధిదారుడు.. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారైతే (ఈడబ్ల్యూఎస్) వారి వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు దాటకూడదు. అల్పాదాయ వర్గాల వారు అయితే రూ. 3-6 లక్షల్లోపు ఆదాయం ఉండాలి. మధ్యస్థాయి ఆదాయ వర్గం-1 అయితే రూ. 6-12 లక్షలు, మధ్యస్థాయి ఆదాయ వర్గం-2 అయితే రూ. 12-18 లక్షల వరకు ఆదాయం ఉండొచ్చు.

ఈ పథకం కింద ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వారికి సొంత స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం వస్తుంది. భూమి లేకుంటే ఎక్కడో చోట భూమి ఇస్తుంది. వీరికి రూ. 1.50 లక్షలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. ఇక మిగతా డబ్బులు మొత్తాన్ని సబ్సిడీ కింద బ్యాంక్ లోన్ వస్తుంది. తక్కువ వడ్డీ రేటుకు ఈ లోన్ వస్తుంది.

ఇక ఈ స్కీంలో చేరేందుకు ఆధార్ కార్డు, ఇన్‌కం సర్టిఫికెట్, వయసు ధ్రువీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలి. ముందుగా పీఎం ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా సమీపంలోని మీ సేవా కేంద్రాల్లోకి లేదా కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

Show comments