బడ్జెట్‌కు ముందు సామాన్యులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర

Gas Cylinder Price: బడ్జెట్‌కు ముందు చమురు కంపెనీలు సామాన్యులకు భారీ షాక్‌ ఇచ్చాయి. సిలిండర్‌ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

Gas Cylinder Price: బడ్జెట్‌కు ముందు చమురు కంపెనీలు సామాన్యులకు భారీ షాక్‌ ఇచ్చాయి. సిలిండర్‌ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

నెల ప్రారంభం అయ్యింది అంటే చాలు.. కొన్ని విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది గ్యాస్‌ సిలిండర్‌ ధర. ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలను మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా బడ్జెట్‌ రోజే.. చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక బడ్జెట్‌ రోజునే గ్యాస్‌ రేటు పెరగడం సామాన్యులకు షాక్‌ అనే చెప్పవచ్చు. మరి ఇంతకు గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత పెరిగింది.. అంటే..

బడ్జెట్ రోజే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే చమురు కంపెనీలు పెంచింది గృహ వినయోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర కాదు. 19 కేజీల కమర్షియల్ ఎల్‌‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరని రూ.14 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశాయి. అయితే అన్ని చోట్ల ఈ పెంపు ఒకేలా లేదు. ఇక ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర 14 రూపాయలు పెరిగింది. గతంలో ఇది రూ. 1755.50గా ఉండగా.. ప్రస్తుతం రూ. 1769.50 గా ఉంది.

దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇవి..

గత నెల అనగా జనవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గ్యాస్‌ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 18 పెరిగి 1887 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో అంతకుముందు రూ. 1985 గా ఉండగా.. ఇప్పుడు రూ. 17 పెరిగి 2002 రూపాయలకు చేరింది. చెన్నైలో కూడా 18 రూపాయలు పెరిగి.. రూ.1937కు చేరింది. గత మూడేళ్ల నుంచి చూసుకుంటే.. దాదాపు ప్రతి నెలా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు మారుతున్నాయి. అదే డొమెస్టిక్ గ్యాస్ రేట్లు మాత్రం కేవలం 17 సార్లు మాత్రమే పెరగడం లేదా తగ్గడం జరిగింది.

ఈ వాణిజ్య గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ.. ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. చివరిసారిగా గతేడాది రాఖీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గ్యాస్ రేట్లు తగ్గించి మహిళలకు కానుక ఇచ్చారు. అప్పుడు ఒకేసారి ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 తగ్గించారు. ఇక ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద అర్హులైన వారికి సబ్సిడీని రూ. 200-300 కు పెంచారు. దీంతో గ్యాస్ రేట్లు చాలా వరకు తగ్గాయని చెప్పొచ్చు. ఎన్నికల నేపథ్యంలో ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. 2023 ఆగస్టు నుంచి డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Show comments