Vinay Kola
Oben Rorr EZ: మార్కెట్లో ఒబెన్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల అయ్యింది. దీని ఫీచర్లు అదిరిపోయాయనే చెప్పాలి.
Oben Rorr EZ: మార్కెట్లో ఒబెన్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల అయ్యింది. దీని ఫీచర్లు అదిరిపోయాయనే చెప్పాలి.
Vinay Kola
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇండియన్ మార్కెట్లో ఎన్నో కొత్త కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్ విడుదల అవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఒబెన్ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోర్ ఇజెడ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీని ఫీచర్లు తక్కువేం కాదు. వీటి గురించి తెలిస్తే కచ్చితంగా వావ్ అనాల్సిందే. పైగా దీని ధర కూడా చాలా తక్కువ. దీనిలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవి తెలిస్తే పెట్రోల్ బైక్ కంటే బెస్ట్ అంటారు. ఇంతకీ దీని ఫీచర్స్ ఏంటి? స్పెషాలిటీస్ ఏంటి? దీని ధర ఎంత? మనం దీన్ని ఎందుకు కొనవచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మనం ఎందుకు కొనొచ్చు అంటే ఇది సిటీలో తిరగడానికి బాగా పని చేస్తుంది. కష్టమైన ప్రయాణాలను కూడా కమ్ఫర్ట్ గా చేస్తుంది. ఈ సూపర్ స్టైలిష్ బైక్ ని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. దీన్ని అప్డెటెడ్ డిజైన్ తో అప్డెటెడ్ ఫీచర్లతో తయారు చేశారు. పైగా దీని ధర కూడా పెట్రోల్ బైకులతో పోల్చుకుంటే చాలా తక్కువ అనే చెప్పవచ్చు. ఇక ఈ బైక్ స్టార్టింగ్ ప్రైజ్ విషయానికి వస్తే కేవలం రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధర మాత్రమే ఉంటుంది. అయితే ఈ ధర ఫ్యూచర్ లో ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, హై మెంటేనెన్స్ ని దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు. క్లచ్, గేర్ షిఫ్టింగ్, హీటింగ్ మొదలైన రోజువారీ ప్రయాణ సవాళ్లను తట్టుకునే విధంగా దీన్ని తయారు చేశారు. ఈ బైక్ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై కంఫర్ట్ హ్యాండ్లింగ్, సూపర్ పెర్ఫామెన్స్ ని అందిస్తుంది. దీనికి 52 Nm బెస్ట్-ఇన్-క్లాస్ టార్క్ ఉంటుంది.
ఈ బైక్ నడిపేటప్పుడు మనం సిటీ ట్రాఫిక్‌లో ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేయలేము. ఈ బైక్ 175 కిమీ (IDC) వరకు మంచి మైలేజ్ రేంజ్ ని ఇస్తుంది. చాలా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీనికి ఛార్జింగ్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ బైక్ బ్యాటరీ కేవలం 45 నిమిషాల్లోనే 80% ఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఈ బైక్ మొత్తం మూడు బ్యాటరీ వేరియంట్‌లలో లభిస్తుంది. 2.6 kWh, 3.4 kWh, 4.4 kWh లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో అప్డెటెడ్ పేటెంట్ కలిగిన LFP బ్యాటరీ టెక్నాలజీ ఉంది. అందువల్ల దీని పెర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. దీని బ్యాటరీని 50% హై టెంపరేచర్ తగ్గించే విధంగా తయారు చేశారు. ఇది 2X అంటే రెండు రెట్లు ఎక్కువ లైఫ్ ఇస్తుంది. భారతదేశంలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా దీన్ని తయారు చేశారు. ఇక ఈ బైక్ 95 km/h మాక్సిమం స్పీడ్ ని ఇస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 km/h స్పీడ్ ని అందుకోగలదు. ఇదీ సంగతి. మరీ ఈ సూపర్ స్టైలిష్ బైక్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.