P Venkatesh
Rupay credit card: మీరు రూపే క్రెడిట్ కార్డును కలిగి ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ బ్యాంకులకు కీలక సూచన చేసింది. దీంతో వారికి భారీ ప్రయోజనం చేకూరనున్నది.
Rupay credit card: మీరు రూపే క్రెడిట్ కార్డును కలిగి ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ బ్యాంకులకు కీలక సూచన చేసింది. దీంతో వారికి భారీ ప్రయోజనం చేకూరనున్నది.
P Venkatesh
క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీరుస్తుండడంతో క్రెడిట్ కార్డులను వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే ట్రాన్సాక్షన్స్ పై బ్యాంకులు రివార్డులు, ఇతర ప్రయోజనాలు అందిస్తుంటాయి. ఈ క్రమంలో రూపే క్రెడిట్ కార్డుదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ గుడ్ న్యూస్ అందించింది. ఇతర కార్డు లావాదేవీలపై అందించే రివార్డ్ పాయింట్స్ మాదిరిగానే రూపే క్రెడిట్ కార్డులకు, వాటితో చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు అందించాలని బ్యాంకులకు కీలక సూచన చేసింది.
షాపింగ్, హెటల్స్, ఇతర అవసరాల కోసం క్రెడిట్ కార్డులను యూజ్ చేసి పేమెంట్ చేస్తుంటారు. ఆయా బ్యాంకులు క్రెడిట్ కార్డుదారులకు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంటాయి. ఇప్పుడు ఎన్పీసీఐ నిర్ణయంతో రూపే క్రెడిట్ కార్డుదారులకు కూడా మరిన్ని రివార్డ్ పాయింట్స్ అందించనున్నాయి బ్యాంకులు. సెప్టెంబర్ 1 నుంచి తమ ఆదేశాలు పాటించాలని ఎన్పీసీఐ బ్యాంకులకు సూచించింది. దీనివల్ల రూపే కార్డులను ఉపయోగించి సాధారణ, యూపీఐ లావాదేవీలు చేసే వారు మరిన్ని రివార్డులను అందుకొనే అవకాశం ఉంది.క్రెడిట్ కార్డులను వినియోగించి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వెసులుబాటును ఆర్‌బీఐ 2022లో కల్పించిన సంగతి తెలిసిందే.
క్రెడిట్ కార్డు రివార్డులు అనేవి కార్డు వినియోగం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రూపే క్రెడిట్ కార్డు, రూపే క్రెడిట్ కార్డు యూపీఐ లావాదేవీలపై అందించే ప్రయోజనాలు.. ఇతర కార్డు లావాదేవీలపై అందిస్తున్న రివార్డులు, ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకోవాలి అని ఎన్‌పీసీఐ బ్యాంకులకు సూచించింది. రూపే క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ పై ఇస్తున్న రివార్డులు, ఇతర కార్డులకు ఇస్తున్న రివార్డులు తక్కువగా ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని తొలగించేందుకు రూపే క్రెడిట్ కార్డులకు కూడా అన్ని కార్డుల మాదిరిగానే రివార్డ్ పాయింట్స్ ఇవ్వాలని ఎన్పీసీఐ బ్యాంకులకు సూచించింది.