New Royal Enfield Classic 350 Launch Highlights: మార్కెట్​లోకి సరికొత్త రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్-350.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

మార్కెట్​లోకి సరికొత్త రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్-350.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

Royal Enfield Classic 350: ప్రముఖ టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్​ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ బైక్స్​కు మార్కెట్​లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది రూపొందించిన వాటిల్లో బాగా అమ్ముడుపోయిన బైక్​గా క్లాసిక్ 350 మోడల్​ను చెప్పొచ్చు.

Royal Enfield Classic 350: ప్రముఖ టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్​ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ బైక్స్​కు మార్కెట్​లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది రూపొందించిన వాటిల్లో బాగా అమ్ముడుపోయిన బైక్​గా క్లాసిక్ 350 మోడల్​ను చెప్పొచ్చు.

ప్రముఖ టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్​ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ బైక్స్​కు మార్కెట్​లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. యూత్​తో పాటు అన్ని వయసుల వారికి నచ్చేలా బైక్స్​ను తయారు చేయడం రాయల్ ఎన్​ఫీల్డ్​కు వెన్నతో పెట్టిన విద్య. బుల్లెట్ దగ్గర నుంచి హంటర్ 350 వరకు ఆ కంపెనీ తీసుకొచ్చిన చాలా మోడల్స్ సక్సెస్ అయ్యాయి. ఇది రూపొందించిన వాటిల్లో బాగా అమ్ముడుపోయిన బైక్​గా క్లాసిక్ 350 మోడల్​ను చెప్పొచ్చు. కాలేజీ, ఆఫీస్ యూజ్​తో పాటు టూర్లకు వెళ్లేందుకు ఈ మోడల్​ను వినియోగిస్తూ వచ్చారు. అన్ని రకాల కస్టమర్లకు ఫేవరెట్​గా మారిన క్లాసిక్ 350ని అప్​గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది రాయల్ ఎన్​ఫీల్డ్. దీని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రాయల్ ఎన్​ఫీల్డ్ సంస్థ సరికొత్త 2024 రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్​ను అప్​డేట్ చేసిన కంపెనీ.. సెప్టెంబర్ 1వ తేదీన భారత మార్కెట్​లోకి లాంచ్ చేయనుంది. ఈ బండి బుకింగ్​లు, టెస్ట్ రైడ్​లు కూడా అదే రోజు మొదలవుతాయి. సరికొత్త క్లాసిక్ 350 మొత్తంగా 5 వేరియంట్స్​లో లభిస్తుంది. ఇందులో హెరిటేజ్, హెరిటేజ్ ప్రీమియం, సిగ్నల్స్, డార్క్, ఎమరాల్డ్ అనే 7 విభిన్నమైన కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మద్రాస్ రెడ్, జోధ్​పూర్ బ్లూ అనేవి హెరిటేజ్ వేరియంట్​లో ఉన్నాయి. అదే హెరిటేజ్ ప్రీమియం వేరియంట్ అయితే మెడాలియన్ బ్రాంజ్ కలర్​లో దొరుకుతుంది. సిగ్నల్స్ అయితే కమాండో శాండ్​లో.. డార్క్ వేరియంట్ గన్ గ్రే కలర్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్స్​లో వస్తుంది. ఎమరాల్డ్ క్రోమ్, కాపర్ పిన్​స్ట్రైప్​ వేరియంట్లు కూడా ఉన్నాయి.

నయా క్లాసిక్ 350లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​లు, ఎల్​ఈడీ పైలట్ ల్యాంప్​తో పాటు క్లస్టర్ మీద గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇస్తున్నారు. అలాగే టియర్ డ్రాప్ ట్యాంక్, టైప్​-సీ యూఎస్​బీ ఛార్జింగ్ పాయింట్​ను అందిస్తున్నారు. డార్క్, ఎమరాల్డ్ వేరియంట్లలో ఎడ్జెస్టబుల్ లీవర్, ఎల్​ఈడీ వింకర్​లతో పాటు ట్రిప్పర్ ప్యాడ్ స్టాండర్డ్ ఫిట్​మెంట్​ ఉన్నాయి. ఇంజిన్ విషయంలో మార్పులు చేయలేదు. జే-సిరీస్ ఇంజిన్​నే కొనసాగిస్తున్నారు. 349 సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్, 5 స్పీడ్ గేర్​బాక్స్​తో వస్తుంది. 20.2 బీహెచ్​పీ పవర్, 27 ఎన్​ఎమ్ టార్క్​ను ఈ బైక్ ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలు చేసే వేరియంట్స్​ను బట్టి ఫ్రంట్ సైడ్ 19 ఇంచ్ వీల్ (అలాయ్ లేదా స్పోక్), బ్యాక్ సైడ్ 18 ఇంచ్ వీల్​ను పొందొచ్చు. ప్రస్తుత క్లాసిక్ 350 ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.25 లక్షలు (ఎక్స్-​షోరూమ్) ఉంది. 2024 క్లాసిక్ 350 ధర పెరిగే ఛాన్స్ ఉంది.

Show comments