Are You Selling Gold Jewellery: గోల్డ్ అమ్ముతున్నారా? ఈ రూల్స్ తెలుసుకోకపోతే చాలా డబ్బు నష్టపోతారు

గోల్డ్ అమ్ముతున్నారా? ఈ రూల్స్ తెలుసుకోకపోతే చాలా డబ్బు నష్టపోతారు

Are You Selling Gold Jewellery: బంగారు నగలు అమ్ముతున్నారా? అయితే ఈ నిబంధన గురించి తెలియకపోతే మీరు కొంత మొత్తం డబ్బు నష్టపోతారు. బంగారు నగలు అమ్మినట్లైతే మీరు వెంటనే ఈ పని చేయాలి. అప్పుడే మీకు నష్టం అనేది ఉండదు.

Are You Selling Gold Jewellery: బంగారు నగలు అమ్ముతున్నారా? అయితే ఈ నిబంధన గురించి తెలియకపోతే మీరు కొంత మొత్తం డబ్బు నష్టపోతారు. బంగారు నగలు అమ్మినట్లైతే మీరు వెంటనే ఈ పని చేయాలి. అప్పుడే మీకు నష్టం అనేది ఉండదు.

ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. కొన్ని కొనుగోళ్లు, విక్రయాలు, పెట్టుబడులపై పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు పొందాలంటే కనుక మీరు ఇలా చేయాలి. ముఖ్యంగా బంగారం అమ్మాలనుకునేవారు ఈ విషయం గురించి తెలుసుకోవాలి. లేదంటే మీ డబ్బు వృధా అవుతుంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. సంబంధిత వస్తువులు గానీ ఆస్తులను కానీ ఎంతకాలం మీ దగ్గర ఉంచుకున్నారనే దాని మీద పన్ను రేటు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు మూడేళ్ళ పాటు మీ దగ్గరున్న బంగారాన్ని అమ్మాలనుకుంటే కనుక మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మూడేళ్ళ లోపు బంగారు ఆభరణాలు విక్రయిస్తే కనుక.. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 54ఎఫ్ కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పై పన్ను చెల్లింపుదారులు పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ రూల్ ప్రకారం.. మీరు బంగారు ఆభరణాలను విక్రయించి.. ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనడం ద్వారా పన్నుపై మినహాయింపు ఉంటుంది. బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన లాభాలను సంపాదించి ఆ డబ్బు మీ దగ్గర పెట్టుకుంటే ట్యాక్స్ అనేది పడుతుంది. అదే డబ్బుతో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే ఎటువంటి ట్యాక్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. మూడేళ్ళ పాటు మీ దగ్గరున్న గోల్డ్ ఆభరణాలను విక్రయిస్తే.. 20 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. అయితే గోల్డ్ అమ్మడానికి ఒక ఏడాది ముందు లేదా రెండేళ్ల తర్వాత ప్రాపర్టీ కొనడం అనేది చాలా ముఖ్యం.

అయితే పన్ను చెల్లింపుదారుల పేరు మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉంటే క్లెయిమ్ చెల్లదు. సెక్షన్ 54ఎఫ్ ప్రకారం.. ఆదాయ పన్ను పన్ను మినహాయింపుని క్లెయిమ్ చేయడానికి గరిష్ట పరిమితి 10 కోట్ల రూపాయలు. ఆ పరిమితి దాటితే క్లెయిమ్ చేయడానికి ఉండదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా షార్ట్ టర్మ్ క్యాపిట;ల్ గెయిన్ ట్యాక్స్ మీద పన్ను మినహాయింపు పొందాలంటే ఖచ్చితంగా పన్ను చెల్లింపుదారులు రెసిడెన్షియల్ ప్రాపర్టీని మాత్రమే కొనుగోలు చేయాలనీ నిపుణులు చెబుతున్నారు. కమర్షియల్ ప్రాపర్టీలు, ఇతర ఆస్తులు వంటివి కొనుగోలు చేస్తే పన్ను మినహాయింపు ఉండదని అంటున్నారు. క్యాపిటల్ గెయిన్స్ వచ్చే ఆస్తుల విక్రయానికి ఒక ఏడాది ముందు గానీ రెండేళ్ల తర్వాత గానీ కొనుగోలు చేయాలని చెబుతున్నారు.

Show comments