Keerthi
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల విషయం లో ట్రెండ్ మారింది. ముఖ్యంగా చాలా హంగు ఆర్భాటంతో గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, పై ఫోటోలో ఏలాంటి హంగు ఆర్భాటం లేకుండా సంప్రదాయంగా, చాలా సింపుల్ గా వివాహం చేసుకున్న ఈ జంట ఎవరో కనిపెట్టారా..
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల విషయం లో ట్రెండ్ మారింది. ముఖ్యంగా చాలా హంగు ఆర్భాటంతో గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, పై ఫోటోలో ఏలాంటి హంగు ఆర్భాటం లేకుండా సంప్రదాయంగా, చాలా సింపుల్ గా వివాహం చేసుకున్న ఈ జంట ఎవరో కనిపెట్టారా..
Keerthi
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. అందుకే హిందు సంప్రదాయంలో పెళ్లిళ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక ఈ వేడుక కోసం ఎంతో ఎక్సైటింగా ఎదురుచూస్తుంటారు. ఇకపోతే ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది ఒక అందమైన మధుర జ్ఞాపకం. దీని కోసం చేసే హడావుడి కూడా మాములుగా ఉండదు. ఎవరికి స్థాయి తగ్గట్టుగా వారు ఆర్భాటాలు చేసుకుంటూ తమ పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మరి కొంతమంది చాలా సింపుల్ గా తమ పెళ్లి వేడుకులను నిర్వహించుకుంటారు. కానీ, రాను రాను ఈ ట్రెండ్ అనేది మారింది. సంప్రదాయాలకు అనుగుణంగానే ఆర్భటంగా చేయలానే కొత్త ఆలోచనలకు పునాది పడింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల దగ్గర నుంచి వ్యాపారవేత్తల ఇళ్లలో వరకు ప్రతిఒక్కరూ చాలా గ్రాండ్ గా డెస్టినెసన్స్ వెడ్డింగ్స్ అంటూ నిర్వహిస్తున్నారు. కానీ, పై ఫోటోలో ఏలాంటి హంగు ఆర్భాటం లేకుండా సంప్రదాయంగా, సింపుల్ గా వివాహం చేసుకున్న ఈ జంట ఎవరో కనిపెట్టారా..
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ జంట ఎవరో గుర్తుపట్టారా.. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవలే తమ కుమారుడి వివాహన్ని ఇండియాలోనే రాయల్ వెడ్డింగ్ గా నిర్వహించారు. మరి వారెవరో కాదు.. అసియా అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ‘ముకేశ్ అంబానీ’, ‘నీతా అంబానీ’. వీరిద్దరూ 1985లో వివాహ బంధంతో ఒకటైయ్యారు. అయితే ఇప్పుడు ముకేశ్ అంబానీ తండ్రి ధీరుభాయి అంబానీ ఇప్పుడు అనంత్ పెళ్లి అంత ఘనంగా చేయకపోయినా.. అప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగానే గ్రాండ్ గానే ముకేశ్, నీతాల పెళ్లి చేశారు. అయితే ప్రస్తుతం అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ముకేశ్ అంబానీ – నీతా అంబానీ పెళ్లి ఫొటోలు కూడా బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ముకేశ్,నీతా అప్పటిలో చాలా అందంగా ఉన్నారని, వీరి పెళ్లి అప్పటి సంప్రదాయం ప్రకారం బాగా జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ లు జులై 12వ తేదీన వివాహబంధంతో ఒకటైయ్యారు. కాగా, వీరి వివాహానికి దేశాధినేతలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ, క్రీడా రంగాల నుంచి ప్రముఖులు హాజరైయ్యి సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాయల్ వెడ్డింగ్ కోసం అంబానీ సూమారు రూ.5000 కోట్లు అయ్యిందని సమాచారం వినిపిస్తుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముకేశ్ అంబానీ, నీతా మార్చంట్ ల పెళ్లి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.