Mukesh Ambani: అంబానీ మాస్టర్ ప్లాన్.. బ్యాంకింగ్ రంగంలోకి ఎంట్రీ! ప్రజలకి ఆ లోన్స్ కూడా!

Jio Financial Services-Home Loan: ప్రముఖ వ్యాపారవేత్త తన వ్యాపార సామ్రాజ్యాన్ని బ్యాకింగ్ రంగంలోకి కూడా విస్తరించే యోచనలో ఉన్నారు. దీనిలో భాగంగా కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

Jio Financial Services-Home Loan: ప్రముఖ వ్యాపారవేత్త తన వ్యాపార సామ్రాజ్యాన్ని బ్యాకింగ్ రంగంలోకి కూడా విస్తరించే యోచనలో ఉన్నారు. దీనిలో భాగంగా కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానంతో పాటు ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. దేశవిదేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇక మన దేశంలో ఆయన అడుగు పెట్టని రంగం అంటూ లేదని చెప్పవచ్చు. టెలికాం, రిటైల్, ఫ్యాషన్ ఇలా అన్ని రంగాల్లోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముందుకు సాగుతున్న అంబానీ.. ఇప్పుడు మరో కీలక రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అంబానీ. బ్యాంకింగ్ రంగంలోకి కూడా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే బ్యాంకింగ్ సెక్టార్లో అతి కీలకమైన లోను సదుపాయాన్ని కూడా కల్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆ వివరాలు..

రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాక దేశ ప్రజలకు గృహాలను నిర్మించుకోవడానికి హోం లోన్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఆయన ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో సామాన్యులకు గృహ రుణాలను అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం సంస్థ తరపున పనులు కూడా ప్రారంభించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ను ఏడాది క్రితమే అనగా 2023లోనే ప్రారంభించారు. కానీ సంవత్సరంలోపే కంపెనీ హోం లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం విశేషం అంటున్నారు మార్కెట్ నిపుణులు.

కంపెనీ సమాచారం ప్రకారం.. జియో ఫైనాన్షియల్ ఎన్‌బీఎఫ్‌సీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, గృహ రుణ సేవను ప్రారంభించే ప్రక్రియలో చివరి దశలో ఉందని తెలుస్తోంది. ఇది టెస్టింగ్ (బీటా)గా ప్రారంభించింది. ఇది కాకుండా ఆస్తిపై రుణం, సెక్యూరిటీలపై రుణం వంటి ఇతర ఉత్పత్తులను కూడా పరిచయం చేయబోతోంది.

శుక్రవారం జరిగిన మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో (పోస్ట్-లిస్టింగ్) వాటాదారులను ఉద్దేశించి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) హితేష్ సేథియా మాట్లాడుతూ.. తాము గృహ రుణాలను ప్రారంభించే ప్రక్రియలో భాగంగా చివరి దశలో ఉన్నామని చెప్పుకొచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుందని.. త్వరలోనే హోం లోన్ ఇచ్చేందుకు అన్ని విధాల సిద్ధం కాబోతున్నామని తెలిపారు.

ఆస్తిపై రుణం, సెక్యూరిటీలపై రుణం వంటి ఇతర ఉత్పత్తులు కూడా లైన్‌లో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇప్పటికే సప్లై చైన్ ఫైనాన్సింగ్, మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు, ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్ కోసం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ వంటి సురక్షిత రుణ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇక త్వరలోనే హోం లోన్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టబోతుందన్నమాట

Show comments