Dharani
Collateral Free Loans: లోన్ కావాలంటే.. ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే. సొంత ఊరిలో అప్పు పుట్టాలన్నా హామీలు ఉండాల్సిందే. ఈ క్రమంలో కొందరికి ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు..
Collateral Free Loans: లోన్ కావాలంటే.. ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే. సొంత ఊరిలో అప్పు పుట్టాలన్నా హామీలు ఉండాల్సిందే. ఈ క్రమంలో కొందరికి ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో అప్పు పుట్టడం చాలా కష్టం.. అది కూడా ఎలాంటి హామీ లేకుండా అప్పు దొరకడం అంటే ఇక అది మరో ప్రపంచ వింత అన్నమాటే. ఇక బ్యాంక్ లోన్లు పొందడం అంటే.. దాని కన్నా ఎండమావిలో నీరు వెలికి తీయడం చాలా ఈజీ అనిపిస్తుంది. అన్నింటికి అన్ని పత్రాలు సరిగా ఉన్నా సరే.. చాలా బ్యాంకులు లోన్ ఇచ్చే ప్రాసెస్‌లో కస్టమర్లను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలాంటి నేపథ్యంలో కొన్ని సంస్థలు, బ్యాంకులు మాత్రం ఎలాంటి హామీ లేకుండా.. కోట్ల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇందుకోసం దేన్ని తాకట్టు పెట్టుకోవడం లేదు. మరి ఇంతకు ఆ సంస్థలు, బ్యాంకులు ఏవి.. ఎవరికి ఇలా హామీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నాయి.. అసలు ఈ లోన్ తీసుకునే ప్రాసెస్ ఏంటి.. ఏమేం కావల్సి ఉంటుంది వంటి వివరాలు మీకోసం..
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్.. దీనిపై దృష్టి సారించింది. దేశంలో పారిశ్రామికాభివృద్ధిని పెంపొందించడమే కాక.. ఉపాధి కల్పన కోసం.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా వారికి ఎలాంటి హామీ లేకుండా లోన్లు మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా చిరు, చిన్న తరగతి వ్యాపారస్తులకు ఎలాంటి తాకట్టు లేకుండానే.. అనగా కొలేటర్ ఫ్రీ బిజినెస్ లోన్స్ ఇస్తుంది.
చిన్న, మధ్య తరగతి వ్యాపారస్తులకు ఇవి సంజీవని లాంటివని చెప్పవచ్చు. అయితే ఇలా తాకట్టు లేకుండా రుణం పొందాలంటే.. కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రస్తుతం దేశంలోని అని ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకులు ఇలా తాకట్టు లేని రుణాలు మంజూరు చేస్తున్నాయి. వీటిలో పర్సనల్ మొదలు.. బిజినెస్ లోన్ల వరకు వేర్వేరు రకాల రుణాలున్నాయి. అయితే ఇలాంటి లోన్లు తీసుకునేముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మోసపోయే ఛాన్స్ ఉంది.