ఈ ఏరియాలో స్థలం మీద లక్ష ఇన్వెస్ట్ చేస్తే 4 లక్షలు లాభం!

ప్రస్తుతం హైదరాబాద్ లో అందరి చూపు హైవేల మీదనే ఉంది. బెంగళూరు, శ్రీశైలం, ముంబై, విజయవాడ హైవేల మీద ఉన్న ల్యాండ్స్ పై పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ హైవేల మీద రియల్ ఎస్టేట్ లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 

ప్రస్తుతం హైదరాబాద్ లో అందరి చూపు హైవేల మీదనే ఉంది. బెంగళూరు, శ్రీశైలం, ముంబై, విజయవాడ హైవేల మీద ఉన్న ల్యాండ్స్ పై పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ హైవేల మీద రియల్ ఎస్టేట్ లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 

భూమిని నమ్ముకున్నవాళ్లు బాగుపడినట్టే గానీ బాధపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఇందులో పెట్టుబడి పెట్టినా గానీ నష్టాలు ఉంటాయేమో గానీ భూమ్మీద పెట్టుబడి పెడితే నష్టాలు రావడం అనేది అసాధ్యమని ఇప్పటికే చాలా మంది ప్రూవ్ చేశారు. భూమిని నమ్ముకుని చాలా మంది పెట్టుబడి పెట్టారు. సామాన్యులు ధనవంతులయ్యారు. ధనవంతులు మరింత సంపన్నులయ్యారు. సామాన్యులు కూడా ధనవంతులవ్వడానికి ఇప్పుడొక మార్గం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే లక్షకు 4 లక్షలు లాభం వస్తుందని.. అది కూడా నాలుగేళ్లలో వస్తుందని అంటున్నారు. 

ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?:

హైదరాబాద్-విజయవాడ హైవే మీద ఉన్న ప్లాట్స్ కి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉంటుందని అంటున్నారు. జాతీయ రహదారి కావడం, 6 లైన్ల రోడ్ వస్తుండడం కారణంగా హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్స్ లో ప్లాట్స్ కి డిమాండ్ అనేది భారీగా పెరగనుంది. ఇప్పటి వరకూ వెస్ట్, సౌత్ హైదరాబాద్ జోన్స్ డెవలప్ అయ్యాయని.. ఇప్పుడు తూర్పు హైదరాబాద్ కూడా ఆ స్థాయిలో డెవలప్ కాబోతుందని నిపుణులు చెబుతున్నారు. విజయవాడ వరకూ 6 లైన్స్ రోడ్ పడుతుండడం.. అవుటర్ రింగ్ రోడ్ కి, రీజనల్ రింగ్ రోడ్ కి విజయవాడ హైవే దగ్గరగా ఉండడం ఒక అడ్వాంటేజ్. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. ఈ ఏరియాల్లో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు.

రాబడి ఎక్కువ:

గచ్చిబౌలి నుంచి విజయవాడ హైవే 39 కి.మీ దూరంలో ఉంది. గంటలోపే జర్నీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్పేది ఏంటంటే.. హైదరాబాద్ కి పరిసర ప్రాంతాల్లో 100 కి.మీ. దూరంలో ఎక్కడ ల్యాండ్ కొన్నా గానీ ఫ్యూచర్ లో మంచి రేటు అనేది వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 40 కి.మీ. లోపే విజయవాడ హైవే మీద ల్యాండ్ దొరుకుతుంటే సామాన్యులకు ఇంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదేమో. హైవేకి ఆనుకుని ఉన్న వెంచర్స్ లో స్థలాలు కొంటే మాత్రం మంచి రాబడి ఉంటుందని చెబుతున్నారు. హైవే పక్కనే ఉన్న స్థలాలు కొనుక్కుంటే ఫ్యూచర్ వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదని అంటున్నారు.

లక్షకు 4 లక్షలు:

ఈ హైవే మీద గజం 8 వేలు, 9 వేలు, 10 వేలు రేంజ్ లో ఉన్నాయి. 120 గజాల ప్లాట్స్ 10 లక్షలకు, 11 లక్షలకు దొరుకుతున్నాయి. 200 గజాల స్థలాలు 28 లక్షలకే దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు హైవే పక్కన ఉన్న ప్లాట్స్ లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారికి ప్రతీ లక్షకూ నాలుగేళ్లలో 4 లక్షలు వస్తాయని చెబుతున్నారు. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఏరియాల్లా విజయవాడ హైవే డెవలప్ అవుతుందని.. గజం లక్షల్లో పలుకుతుందని అంటున్నారు. 1998లో జూబ్లీహిల్స్ లో గజం 750 ఉంటే.. ఇప్పుడు 3 లక్షలు అయ్యింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఈ 26 ఏళ్లలో ఎన్ని రెట్లు పెరిగిందో అనేది.    

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.

Show comments