Swetha
Kubhera Movie : శేఖర్ కమ్ముల , ధనుష్ , నాగార్జున కాంబినేషన్ లో కుభేర అనౌన్స్ చేసినప్పటినుంచి.. సినిమా మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఏ ఉంది. ఇక ఎప్పుడైతే రొటీన్ కు భిన్నంగా టీజర్ రిలీజ్ చేసారో.. అప్పుడు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Kubhera Movie : శేఖర్ కమ్ముల , ధనుష్ , నాగార్జున కాంబినేషన్ లో కుభేర అనౌన్స్ చేసినప్పటినుంచి.. సినిమా మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఏ ఉంది. ఇక ఎప్పుడైతే రొటీన్ కు భిన్నంగా టీజర్ రిలీజ్ చేసారో.. అప్పుడు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Swetha
శేఖర్ కమ్ముల , ధనుష్ , నాగార్జున కాంబినేషన్ లో కుభేర అనౌన్స్ చేసినప్పటినుంచి.. సినిమా మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఏ ఉంది. ఇక ఎప్పుడైతే రొటీన్ కు భిన్నంగా టీజర్ రిలీజ్ చేసారో.. అప్పుడు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈసారి శేఖర్ కమ్ముల కచ్చితంగా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుంటాడని అంతా భావిస్తున్నారు. ఏషియన్ సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాణంలో ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ‘పోయిరా మామా’ సాంగ్తో అభిమానులను ఆకర్షించింది.
ఇక రీసెంట్ గా ఈ సినిమానుంచి అనగనగ కథ అంటూ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ సాంగ్ లిరిక్స్ ను గమనిస్తే ప్రస్తుతం సమాజంలోని ఆర్థిక వ్యత్యాసాలను, అణగారిన వర్గాల బాధలను తీవ్రంగా చూపిస్తూ ఆలోచింపజేసేలా ఉంది. అసలు కుభేర మూవీ ప్లాట్ ఏంటి అనేది కూడా ఈ సాంగ్ చెప్పేస్తుంది. ఇలా సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతిఒక్కటి సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి.
సినిమాలోని క్యరెక్టర్స్ గురించి ఇంకా పూర్తిగా తెలియకపోయిన కూడా.. ఈ సినిమాలో మాత్రం చాలా డెప్త్ ఉన్నట్లు అర్ధమౌతుంది. ఈ సినిమ జూన్ 20 న తెలుగు ,తమిళం, హిందీ ,కన్నడ , మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. శేఖర్ కమ్ముల ఓ నార్మల్ కథను కూడా స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి అద్భుతంగా చెప్పగలడు. కానీ ఇప్పుడు ఇలా సమాజానికి సంబందించిన కథను తెరపై ఎలా చూపిస్తాడు అనేది చూడాలి. మొత్తానికి ‘అనగనగా కథ’ సాంగ్ ‘కుబేర’ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.