iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి బాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్..ఎక్కడంటే ?

  • Published Jun 03, 2025 | 2:30 PM Updated Updated Jun 03, 2025 | 2:30 PM

Sinners OTT Streaming : కొన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేందుకు సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఇక ఓటిటి లో భాష కంటే కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమాను కూడా బాగానే ఆదరిస్తారనిపిస్తుంది. ఇది ఓ బాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్. ఏప్రిల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సినిమా అంచనాలను మించిన సంచలనాలను సృష్టించింది.

  • Published Jun 03, 2025 | 2:30 PMUpdated Jun 03, 2025 | 2:30 PM
సడెన్ గా OTT లోకి బాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్..ఎక్కడంటే ?

కొన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేందుకు సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఇక ఓటిటి లో భాష కంటే కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమాను కూడా బాగానే ఆదరిస్తారనిపిస్తుంది. ఇది ఓ బాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్. ఏప్రిల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సినిమా అంచనాలను మించిన సంచలనాలను సృష్టించింది. దాదాపు 90 మిలియన్ డాలర్స్ తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 351 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసి హాలీవుడ్‌లో 2025 హ‌య్యేస్ట్ గ్రాస‌ర్ చిత్రాల్లో టాప్ టెన్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అని చూసేముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా 1932బ్యాక్డ్రాప్ లో నడుస్తూ ఉంటుంది. స్మోక్ , స్టాక్ అనే ఇద్దరు అన్నదమ్ములు గ్యాంగ్ స్టార్స్ నుంచి డబ్బు దొంగలించి.. చికాగో నుంచి దూరంగా మిస్సిస్సిప్పి డెల్టా అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ వాళ్ళ కమ్యూనిటీ ప్రజల కోసం ఓ పబ్ ను ఏర్పాటు చేస్తారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ.. పబ్లిక్ పెరుగుతారు. వారంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఓ వ్యాంపైర్ తన వేషం మార్చుకుని అక్కడివారిపై దాడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వెంటనే వారు కూడా పిశాచాల్లా మారిపోతారు. మరి మిగతా వారు తప్పించుకున్నారా లేదా ? చివరకు ఎంత మంది మిగిలారు ? ఆ వ్యాంపైర్ ను హతమార్చారా లేదా ? అసలు అక్కడికి అవి ఎందుకు వచ్చాయి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు సిన్నర్స్. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో , బుక్ మై షో రెండు ఓటిటి లలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్స్ ను ఇష్టపడేవారికి ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. కాబట్టి వెంటనే ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.