Swetha
OTT Suggestions : గతవారం ఓటిటి లో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ వచ్చాయని చెప్పి తీరాల్సిందే. ఈ క్రమంలో గత వారం జియో హాట్ స్టార్ లో ఎంట్రీ ఇచ్చిన ఓ సినిమా ,ఓ సిరీస్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ప్రేక్షకుల నుంచి ఈ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఆ సినిమాలేంటో ఆ కథేంటో చూసేద్దాం.
OTT Suggestions : గతవారం ఓటిటి లో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ వచ్చాయని చెప్పి తీరాల్సిందే. ఈ క్రమంలో గత వారం జియో హాట్ స్టార్ లో ఎంట్రీ ఇచ్చిన ఓ సినిమా ,ఓ సిరీస్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ప్రేక్షకుల నుంచి ఈ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఆ సినిమాలేంటో ఆ కథేంటో చూసేద్దాం.
Swetha
గతవారం ఓటిటి లో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ వచ్చాయని చెప్పి తీరాల్సిందే. ఈ క్రమంలో గత వారం జియో హాట్ స్టార్ లో ఎంట్రీ ఇచ్చిన ఓ సినిమా ,ఓ సిరీస్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ప్రేక్షకుల నుంచి ఈ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఆ సినిమాలేంటో ఆ కథేంటో చూసేద్దాం.
ట్రెండింగ్ లో దూసుకుపోతున్న వాటిలో ఒకటి జియో హాట్ స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ పేరు క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ క్రిమినల్ జస్టిస్ లో భాగంగా వచ్చిన నాలుగో సీజన్ ఇది. మే 29ను జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. హిందీతో పాటు బెంగాలి, మరాఠి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. అయితే ముందు ఈ సీజన్ లో కేవలం మూడు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ప్రతి గురువారం మిగిలిన ఎపిసోడ్స్ ను రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇది కాకుండా ప్రస్తుతం ఎక్కడ చూసిన వినిపిస్తున్న హిట్ మూవీ తుడరుమ్. మోహన్ లాల్ ఈ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందట. దీనితో ఓటిటి కి రావడం కాస్త ఆలస్యం అయింది. మే 30న జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రివేంజ్ థ్రిల్లర్ కు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఫ్యాన్స్ హిట్ చేసేస్తున్నారు. ఇంటెన్సివ్ ఫ్యామిలీ డ్రామా , అదిరిపోయే ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ గూస్ బంప్స్ తెప్పిస్తోందన్న మాట వాస్తవం. ఇంకా ఈ సినిమాలను చూడకపోతే కనుక వెంటనే ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.