P Venkatesh
LIC plans: ఎల్ఐసీ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఎల్ఐసీ అందించే ఆ పాపులర్ పాలసీలను మూసివేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
LIC plans: ఎల్ఐసీ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఎల్ఐసీ అందించే ఆ పాపులర్ పాలసీలను మూసివేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
P Venkatesh
కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు జీవిత బీమా పాలసీలను కడుతుంటారు. ఆపద సమయంలో ఈ పాలసీ ద్వారా వచ్చే డబ్బులు కుటుంబానికి కొండంత అండగా నిలుస్తాయి. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ జీవిత బీమా సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం సూపర్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నది. రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్స్స్ అందించే ఎల్ఐసీ పాలసీలకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఎల్ఐసీ కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఎల్ఐసీ అందిస్తున్న పాపులర్ ప్లాన్స్ ను మూసివేస్తున్నట్లు దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా పాలసీలు సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తున్నది.
ప్రజల నుంచి ఆదరణ పొందిన ఆ పాలసీలను క్లోజ్ చేయడానికి గల కారణం ఏంటంటే? ఎల్ఐసీ కస్టమర్ల కోసం నూతన పాలసీలను అందుబాటులోకి తెస్తున్న క్రమంలో ఆయా ప్లాన్లను మూసివేస్తున్నట్లు తెలుస్తున్నది. సెప్టెంబర్ 30 నుంచి ఆ పాలసీలు ఉండవని సమాచారం. మీడియా నివేదికల ప్రకారం జీవన్ లాబ్ (ప్లాన్ నంబర్ 936), జీవన్ ఉమాంగ్ (ప్లాన్ నంబర్ 945), జీవన్ ఆనంద్ (ప్లాన్ నంబర్ 915), జీవన్ ఉత్సవ్ (ప్లాన్ నంబర్ 871), జీవన్ లక్ష్యా (ప్లాన్ నంబర్ 933), ఎండోమెంట్ ప్లాన్ (ప్లాన్ నంబర్ 914), జీవన్ తరుణ్ (ప్లాన్ నంబర్ 934), మనీ బ్యాక్ ప్లాన్స్ (ప్లాన్ నంబర్ 920, 921), చిల్డ్రెన్ మనీ బ్యాక్ ప్లాన్ (ప్లాన్ నంబర్ 932)లు క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాలసీల ద్వారా మంచి మెచ్యూరిటీ బెనిఫిట్స్, డెత్ బెనిఫిట్స్ పాలసీ హోల్డర్స్ పొందుతారు. ఈ పాలసీలు క్లోజ్ కానున్నాయని తెలియడంతో పాలసీదారులు నిరాశ చెందుతున్నారు. ఇటీవల ఎల్ఐసీ యువత కోసం 4 కొత్త ప్లాన్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.