Dharani
Mahila Samman Saving Certificate Scheme: మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన స్కీమ్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఆ వివరాలు..
Mahila Samman Saving Certificate Scheme: మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన స్కీమ్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఆ వివరాలు..
Dharani
నెలకు లక్షల్లో సంపాదించినా సరే.. అందులో ఎంతో కొంత మొత్తం పొదుపు చేయకపోతే.. వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. నేటి కాలంలో ఎంత తక్కువ సంపాదన ఉన్నా సరే.. పొదుపు చేయడం మాత్రం కచ్చితంగా మారింది. మరి ఎలాంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి.. మన సొమ్ముకు భద్రతతో పాటు అదనపు ఆదాయం వచ్చే పథకాలు ఉన్నాయా అంటే.. ఎందుకు లేవు.. బోలేడు. కేంద్ర ప్రభుత్వం పొదుపుదారుల కోసం ఇప్పటికే రకరకాల స్కీమ్స్ అందుబాటులోకి తెచ్చింది. మరీ ముఖ్యంగా వృద్ధులు, మహిళల కోసం మరిన్ని పథకాలు.. అదనపు వడ్డీ అందిస్తోంది. ఈ క్రమంలో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ ప్రత్యేక పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సరిటిఫికేట్ పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉంది. తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుండ మంచి ఆదాయాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో భాగంగా 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ టెన్యూర్ రెండేళ్లుగా ఉంది.
అంటే మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది అన్నమాట. అంతేకాక ఇందులో గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. దీనిపై కేంద్ర 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. దీనికి మరో అదనపు ప్రయోజనం కూడా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు సైతం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ పథకంలో ఆదాయం ఎలా వస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఈ స్కీమ్ లో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఈ పథకం మీద కేంద్రం 7.5శాతం వడ్డీ అందిస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 2 లక్షల రూపాయల మీద.. మీకు మొదటి ఏడాది 7.5 శాతం వడ్డీ రేటుతో రూ. 15 వేల వడ్డీ లభిస్తుంది.
దానిని అసలుకు జమ చేస్తారు. ఆ తర్వాత రెండో ఏడాదిలో వడ్డీ రూ. 16,125 లభిస్తుంది. అంటే ఈ పథకంలో మహిళలు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లియితే వారికి రెండేళ్ల మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రూపంలో మొత్తంగా రూ. 31,125 వరకు లభిస్తుంది అన్నమాట. అయితే ఈ పథకం 2025 వరకే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండకపోవచ్చు. కనుక రిస్క్ లేకుండా అదనపు ఆదాయం కావాలనుకునే మహిళలు వెంటనే దీనిలో పెట్టుబడి పెట్టండి అంటున్నారు మార్కెట్ నిపుణులు.