Dharani
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే.. ఉచితంగా 50 లక్షల రూపాయలు బీమా పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే.. ఉచితంగా 50 లక్షల రూపాయలు బీమా పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..
Dharani
ఈమధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇళ్లల్లో, హోటల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలితే.. ప్రాణ నష్టంతో పాటు.. ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలుడు వంటి ప్రమాదాలు సంభవిస్తే.. సంబంధిత గ్యాస్ కంపెనీల నుంచి పరిహారం పొందేందుకు అవకాశం ఉంది. గరిష్టంగా రూ.50 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. మరి దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే..
పెట్రోలియం కంపెనీలు.. తమ ఎల్‌పీజీ కస్టమర్లందరికీ ఉచిత ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి. అది కూడా రూ.50 లక్షల వరకు ఉంటుంది. ఈ బీమా కవరేజ్ కోసం ఎల్పీజీ కస్టమర్లు.. ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్రోలియం కంపెనీలే తమ వినియోగదారులకు స్వయంగా ఈ కవరేజీని ఉచితంగా అందిస్తాయి.
దీని వల్ల ఎల్‌పీజీ సిలిండర్ పేలుడు వల్ల ఏర్పడే నష్టాన్ని కవర్ చేసుకోవడానికి.. వినియోగదారులు సంబంధిత పెట్రోలియం కంపెనీ నుండి పరిహారం పొందేందుకు అనుమతి ఉంటుంది. ఎల్‌పీజీ కస్టమర్‌లు, వారి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి రూ.50 లక్షల వరకు మొత్తం పరిహారం లభిస్తుంది. దీని కింద ఒక కుటుంబంలోని ఒక సభ్యుడు రూ.10 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.
ప్రమాదవశాత్తు గ్యాస్ లీకవ్వడం, పేలుడు మొదలైన వాటికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఇందుకోసం పెట్రోలియం కంపెనీలు.. బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. అందుకే ప్రమాదం జరిగితే.. బీమా కంపెనీలు ఆర్థిక సాయం అందజేస్తాయి.
ఎల్పీజీ సిలిండర్ వల్ల ప్రమాదం జరిగి.. ఆస్తి నష్టం సంభవిస్తే.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా వ్యక్తి మరణించిన సందర్భంలో.. రూ. 6 లక్షల మొత్తాన్ని పొందుతారు. గాయం అయితే, ఒక వ్యక్తికి రూ. 2 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.