రెండో సిమ్ యాక్టివ్ గా ఉంచుకునేందుకు బెస్ట్ ప్లాన్స్! జేబు ఖాళీ కాకుండానే..

Recharge Plans: ఇటీవలే అన్నీ టెలికాం సంస్థలు రీఛార్జీ ధరలు పెంచిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో డ్యూయల్ సిమ్ ఉండే వారు..రెండో సిమ్ యాక్టివ్ గా ఉంచుకునేందుకు బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి.

Recharge Plans: ఇటీవలే అన్నీ టెలికాం సంస్థలు రీఛార్జీ ధరలు పెంచిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో డ్యూయల్ సిమ్ ఉండే వారు..రెండో సిమ్ యాక్టివ్ గా ఉంచుకునేందుకు బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి.

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అంతేకాక ఎక్కువ శాతం మంది డ్యూయల్ సిమ్ ను వినియోగిస్తున్నారు. ఆ రెండు నెంబర్లను యాక్టీవ్ లో ఉంచుకునేందుకు బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా  ఉంటే ఇటీవలే చాలా టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్లను పెంచేశాయి. దీనితో జనాలపై చాలా భారం పడనుంది. ఈ క్రమంలోనే డ్యూయల్ సిమ్ ఉన్నవారు.. రెండో సిమ్ యాక్టీవ్ గా ఉంచుకునేందుకు కొన్ని బెస్ట్  రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. మరి… అవి ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవలే అన్నీ టెలికాం సంస్థలు టారీఫ్ ధరలు పెంచేశాయి. తొలుత జియో రీఛార్జ్ ధరలు పెంచగా,…దాని బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కూడా వెళ్లాయి. తమ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఈ  టెలికాం సంస్థ కొత్త ప్లాన్ల చూసి అందరూ చూసి షాకయ్యారు. జియో మీద అయితే ఏకంగా ట్రోల్స్ నడిచాయి. అనంత్ అంబానీ పెళ్లి ఖర్చులు జనాల మీద తీస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇది ఇలా ఉంటే డ్యూయల్ సిమ్ ఉన్నవారు..అందులో ఒకదానికి రీఛార్జ్ చేసుకుని, మరో దానికి చేయకుంటే పని చేయదు. ఎవరు కాల్ చేసినా కలవదు. రెండు సిమ్‌లు కూడా యాక్టివ్‌గా ఉండాలనుకునేవారు తక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

ఇక రెండో సిమ్ యాక్టీవ్ చేసుకునేందుకు తీసుకునే ఈ ప్లాన్లన్నీ రూ.200 లోపే ఉంటాయి. జియో తన తక్కువ ధరను ఎయిర్టెల్, విఐ కంటే రూ .10 తక్కువకు నిర్ణయించింది. దీనితో జియో వినియోగదారులు ఆ ప్లాన్ వేసుకోవచ్చు. ఎయిర్ టెయిల్ రూ .199 ప్లాన్ 2 జీబీ డేటాను 28రోజుల వ్యాలిడిటితో అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ధర ఎక్కువ అనుకునేవారు.. రూ.155 ప్లాన్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇందులో వచ్చే ఆఫర్లలో మార్పు ఉంటుంది. అలానే జియో రూ.189కు 28 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. జియో టీవీతో పాటు జియో సినిమాకి ఉచిత యాక్సెస్ లభించేందుకు ఈ ప్లాన్ ప్రత్యేకతం.

అలానే వొడాఫోన్ ఐడియాలో రూ.199 ప్లాన్ తో 28 రోజుల వాలిడిటి ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. మొత్తంగాపై ప్లాన్లు రెండో సిమ్ ను యాక్టీవ్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇటీవల టెలికాం సంస్థలు పెంచిన రీఛార్జీ ధరలకు అందరు షాక అవుతున్నారు. అయితే మూడేళ్ల నుంచి పెంచకుండా… ఒక్కసారిగా ఈ టెలికాం సంస్థలన్నీ పెంచాయి. ఈ క్రమంలోనే రెండు సిమ్ లను యాక్టీవ్ గా ఉంచుకునేందుకు చాలా మంది వినియోగదారులు బెస్ట్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పైన తెలిపిన ఆఫర్లకు జేబు ఖాళీ కాాకుండా ఉపయోగపడతాయని పలువురు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Show comments