iDreamPost

సిటీలో గజం 8 వేలు.. సెంట్ 4 లక్షలే.. ఇప్పుడు కొంటే కనీసం 15 లక్షల లాభం!

రియల్ ఎస్టేట్ లో లాభాలు పొందాలంటే తక్కువ రేటు ఉన్నప్పుడే ల్యాండ్ ని కొనాలి. సిటీలో గజం 8 వేల రూపాయలు ఉంది. అంటే 150 గజాల స్థలం 4 లక్షలకే వస్తుంది. ఇప్పుడు కొంటే గనుక తక్కువ సమయంలోనే 15 లక్షల నుంచి 20 లక్షల లాభం పొందవచ్చు.

రియల్ ఎస్టేట్ లో లాభాలు పొందాలంటే తక్కువ రేటు ఉన్నప్పుడే ల్యాండ్ ని కొనాలి. సిటీలో గజం 8 వేల రూపాయలు ఉంది. అంటే 150 గజాల స్థలం 4 లక్షలకే వస్తుంది. ఇప్పుడు కొంటే గనుక తక్కువ సమయంలోనే 15 లక్షల నుంచి 20 లక్షల లాభం పొందవచ్చు.

సిటీలో గజం 8 వేలు.. సెంట్ 4 లక్షలే.. ఇప్పుడు కొంటే కనీసం 15 లక్షల లాభం!

ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయచ్చు. లాభం వస్తుందంటే అది హైదరాబాద్ అయినా.. హైదరాబాద్ శివారు ప్రాంతాలైనా.. ఏపీలో అయినా ఎక్కడైనా సరే లాభం కోసమే పెట్టుబడులు పెడతారు. అయితే ఎంత తక్కువ రేటు పలుకుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో అంతకంటే ఎక్కువ లాభాలు అయితే పొందే ఛాన్స్ ఉంది. పెట్టుబడి పెట్టాలనుకుంటే మూడు రకాల ల్యాండ్స్ ఉంటాయి. డెవలప్ అయిన దాంట్లో పెట్టడం ఒకటి. డెవలప్ అవుతున్న దాంట్లో పెట్టడం ఒకటి. డెవలప్ కాబోతున్న దాంట్లో పెట్టడం ఒకటి. ఈ మూడింటిలో డెవలప్ కాబోతున్న దాంట్లో పెట్టుబడి పెడితేనే ఎక్కువ లాభాలు ఆశించవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ధరకే ఇక్కడ ల్యాండ్ అనేది దొరుకుతుంది. మధ్యతరగతి వాళ్ళు కూడా భరించగలిగేలా ఇక్కడ ల్యాండ్ రేట్లు అనేవి తక్కువగా ఉంటాయి. 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏరియా కూడా మిడిల్ క్లాస్ బడ్జెట్ కి అందేదే. మీరు ఏపీకి చెందిన వారు అయితే ఇన్వెస్ట్ మెంట్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. విజయవాడ సిటీలో ప్లాట్ కొనాలంటే పెనమలూరులో గజం 18 వేలు ఉంది. పోరంకిలో కూడా గజం 18 వేలు ఉంది. గన్నవరంలో 17 వేలు ఉంది. కంకిపాడులో గజం 12 వేలు ఉంది. అయితే కంకిపాడు దగ్గర మాత్రం గజం 8 వేలు పలుకుతుంది. బందర్ రోడ్డు కంకిపాడు దగ్గర ప్రొద్దుటూరు విలేజ్ లో గజం 8 వేలు పలుకుతుంది. ఉయ్యూరు నుంచి పామర్రు వరకూ వెంచర్స్ ఉన్నాయి. ఏ వెంచర్ లో అయినా గజం 15 వేల నుంచి 30 వేల రేంజ్ లో ఉన్నాయి. అంటే సెంట్ (150 గజాలు) స్థలం కొనాలంటే 23 లక్షల నుంచి 45 లక్షలు అవుతుంది. విజయవాడలోని గొల్లపూడిలో 48 గజాలు (సెంట్) 30 లక్షలు పలుకుతుంది.

సెంట్ 4 లక్షలే (గజం 8 వేలే):

ఈ లెక్కన 3 సెంట్లు కొనాలంటే 90 లక్షలు అవుతుంది. మంగళగిరి, ముస్తాబాద్ ఏరియాల్లో కూడా సెంట్ 15 లక్షలు పలుకుతుంది. 3 సెంట్లు స్థలం కొనాలంటే 45 లక్షలు అవుతుంది. ఇక బందర్ రోడ్ లో సెంట్ 10 లక్షల నుంచి 30 లక్షల రేంజ్ లో ఉంది. కంకిపాడులో  సెంట్ 6,7 లక్షల నుంచి 12 లక్షలు ఉంది. మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే కష్టమైన పని. అయితే కంకిపాడుని ఆనుకుని ఉన్న ప్రొద్దుటూరులో మాత్రం సెంట్ 4 లక్షలకే అమ్ముతున్నారు. అంటే గజం 8,333 రూపాయలు పడింది. 12 లక్షలకే 150 గజాలు అంటే 3 సెంట్ల స్థలం సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ ధరే సెంట్ 5 లక్షలు ఉంది. కానీ ఇక్కడ మాత్రం 4 లక్షలకే అమ్ముతున్నారు. విద్యుత్ కనెక్షన్, నీటి సదుపాయం, విశాలమైన రోడ్లు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.

కనీసం 15 లక్షలు లాభం:

క్కువ రేటు ఉన్నప్పుడే కొనుక్కుంటే తక్కువ సమయంలో డబుల్, త్రిబుల్ అవుతుంది. బందర్ రోడ్ కి 1.5 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ తూర్పు బైపాస్ రోడ్ వస్తుంది. అది వస్తే కనుక గుంటూరు, గన్నవరం ఏరియాలకు 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. గన్నవరం నుంచి ముస్తాబాద్, గొల్లపూడి ఏరియాలకు పడమర బైపాస్ రోడ్డు రాక ముందు.. అక్కడ కొన్ని ఏరియాల్లో గజం 3 వేలు, 4 వేలు ఉండేది. ఇవాళ పడమర బైపాస్ పక్కన గజం 20 వేలకు తక్కువ లేదు. 150 గజాల స్థలం 30 లక్షలు అయినట్టు. ఈ లెక్కన ఈ ఏరియాలో సపోజ్ 12 లక్షలు పెట్టి 150 గజాల స్థలం కొన్నట్లైతే తక్కువ సమయంలోనే 18 లక్షలు లాభం పొందవచ్చు. కనీసం 15 లక్షలైనా లాభం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

మిడిల్ క్లాస్ వారికి మంచి ఛాన్స్:

విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి కంకిపాడు వరకూ అనేక షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి.  డాక్టర్లు, ఎన్ఆర్ఐలు ఈ ఏరియాలో స్థలాలు కొనుక్కున్నారు. ఏడాదిలో 50 శాతం నివాసాలు అనేవి పూర్తయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు స్థలాలకు డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ 100, 150, 200, 300 అంతకంటే ఎక్కువ చదరపు గజాలుగా విభజించి ప్లాట్స్ ని విక్రయిస్తున్నారు. విజయవాడ-బందర్ హైవేలో కంకిపాడు దగ్గర ప్రొద్దుటూరులో తక్కువ ధరకు ఇండ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిడిల్ క్లాస్ వారికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి