Land Rates In Hyderabad: HYDలో స్థలాల రేట్లు తక్కువగా ఉన్న ఏరియాలివే.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదు!

HYDలో స్థలాల రేట్లు తక్కువగా ఉన్న ఏరియాలివే.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదు!

Land Rates In Hyderabad Real Estate: హైదరాబాద్ నగరం మరింత విస్తరిస్తుంది. అలానే తెలంగాణలో పలు ప్రాంతాలన్నీ కలిసి మరో నగరంగా ఏర్పడుతున్నాయి. ఈ తరుణంలో ఎక్కడ తక్కువ ధరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పొందవచ్చు అనే వివరాలు మీ కోసం.

Land Rates In Hyderabad Real Estate: హైదరాబాద్ నగరం మరింత విస్తరిస్తుంది. అలానే తెలంగాణలో పలు ప్రాంతాలన్నీ కలిసి మరో నగరంగా ఏర్పడుతున్నాయి. ఈ తరుణంలో ఎక్కడ తక్కువ ధరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పొందవచ్చు అనే వివరాలు మీ కోసం.

హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాల్లో స్థలాల రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి వంటి ఏరియాల్లో స్థలాల రేట్లు గజల్లో లక్షల్లో ఉన్నాయి. ఈ ఏరియాల్లో స్థలాలు కొనే పరిస్థితి అయితే లేదు. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం స్థలాల ధరలు గజం 30 వేల రూపాయల లోపే ఉన్నాయి. ఈ ఏరియాల్లో స్థలాలు కొనుగోలు చేస్తే కనుక భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు. హైదరాబాద్ కి కొంచెం దూరంలో ఉన్న ఏరియాలివి. పెట్టుబడికి దూరం అనేది పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో భారీ లాభాలను పొందవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైలు ప్రాజెక్టులను నిర్మిస్తామని ప్రకటించింది. కాబట్టి పెట్టుబడికి ఇదే సరైన సమయం. మరి స్థలాల రేట్లు ఎక్కడెక్కడ తక్కువగా ఉన్నాయో అనేది ఇప్పుడు చూడండి. 

ఆదిభట్లలో యావరేజ్ గా గజం స్థలం 22 వేల రూపాయలుగా ఉంది. బాలానగర్ లో సగటున 15 వేలు, బాలాపూర్ లో సగటున గజం ధర 25 వేలుగా ఉంది. బాలాపూర్ ఎయిర్ పోర్ట్ రోడ్ లో గజం 25 వేలుగా ఉంది. బెంగళూరు హైదరాబాద్ హైవే, హైదరాబాద్ వరంగల్ హైవేల్లో సగటున గజం స్థలం ధర రూ. 16 వేలుగా ఉంది. భువనగిరి, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రంగారెడ్డి, శ్రీశైలం హైవే ఏరియాల్లో గజం స్థలం ధర సగటున 14 వేలు పలుకుతుంది. బీబీ నగర్ 12 వేలు, చేవెళ్ల 13 వేలు, ఇంద్రేశం 25 వేలు, ఇస్నాపూర్ 25 వేలు, కడ్తల్ 12 వేలు, కంది 21 వేలు, కీసర 18 వేలు, కీసర యాదగిరిగుట్ట రోడ్ 8 వేలు ఇలా ఉన్నాయి ధరలు. ఇక కొంగరకలాన్ లో 23 వేలు, కొత్తూరు, మహేశ్వరం, మొయినాబాద్, శంషాబాద్ ప్రాంతాల్లో సగటున గజం స్థలం ధర రూ. 16 వేలుగా ఉంది.

ముచ్చెర్ల, షాద్ నగర్, పరిగి రోడ్ ప్రాంతాల్లో 13 వేలుగా ఉంది. తుక్కుగూడలో 24 వేలు, సదాశివపేటలో 15 వేలు, సంగారెడ్డిలో 16 వేలు, తిమ్మాపూర్ లో 20 వేలు, శామీర్ పేట్, ముంబై హైవే ప్రాంతాల్లో 22 వేలు పలుకుతున్నాయి. యాదగిరిగుట్టలో 8 వేలు, జహీరాబాద్ లో 11 వేలు, పెద్దాపూర్ లో 17 వేలు, పోచారంలో 26 వేలు పలుకుతున్నాయి. హైదరాబాద్ మొత్తంలో ఈ ఏరియాల్లోనే తక్కువ ధరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏరియాల్లో భవిష్యత్తులో స్థలాల ధరలు విపరీతంగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏరియాల్లో 200 గజాల స్థలానికి కనిష్టంగా 16 లక్షల నుంచి గరిష్టంగా 50 లక్షలు అవుతుంది.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడిన యావరేజ్ ధరలివి. ఇంతకంటే ఎక్కువ ఉండచ్చు. తక్కువ ఉండచ్చు. గమనించగలరు.

Show comments