Lit Motors C1: లిట్ మోటార్స్ ఏఈవీ: ఆటో బ్యాలెన్స్ బైక్ కమ్ కారు! ప్రమాదాలు జరగవు

Two Wheeler Car Cum BIke That Prevents Accidents: ఎవరైనా రోడ్డు మీద బైక్ మీద ప్రయాణిస్తున్నప్పుడు కోరుకునేది ప్రాణాలకు భద్రత. హెల్మెట్ పెట్టుకుని వెళ్లినా, కారులో వెళ్లినా గానీ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఒక కంపెనీ మాత్రం మోస్ట్ అడ్వాన్స్డ్ బైక్ ని తయారు చేసింది. ఇది బైక్ లా, కారులా ఉంటుంది. ఈ బైక్ ని ఏ వాహనం గుద్దినా గానీ పడిపోదు. అసలు ప్రమాదాలే జరగవు.

Two Wheeler Car Cum BIke That Prevents Accidents: ఎవరైనా రోడ్డు మీద బైక్ మీద ప్రయాణిస్తున్నప్పుడు కోరుకునేది ప్రాణాలకు భద్రత. హెల్మెట్ పెట్టుకుని వెళ్లినా, కారులో వెళ్లినా గానీ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఒక కంపెనీ మాత్రం మోస్ట్ అడ్వాన్స్డ్ బైక్ ని తయారు చేసింది. ఇది బైక్ లా, కారులా ఉంటుంది. ఈ బైక్ ని ఏ వాహనం గుద్దినా గానీ పడిపోదు. అసలు ప్రమాదాలే జరగవు.

కారుకి, బైక్ కి క్రాసింగ్ లో పుట్టిన వాహనంలా అనిపిస్తుంది కదూ. కానీ దీన్ని కారు అని పిలుచుకున్నా, బైక్ అని పిలుచుకున్నా గానీ పర్లేదు. ఎందుకంటే ఇది కారులో ఉండే కంఫర్ట్ ఈ బైకులో ఉంటుంది కాబట్టి. కారు తీసుకోవాలనుకోవడానికి ప్రధాన కారణం.. వర్షాలు, ట్రాఫిక్, ప్రమాద స్థాయి. వర్షాలు వచ్చినా, ట్రాఫిక్ ఉన్నా గానీ కాస్త రిలాక్స్డ్ గా ఉండచ్చు. అదే బైక్ అయితే ఇరిటేషన్ వస్తుంది. ప్రమాద స్థాయి కూడా బైకుతో పోలిస్తే కార్లలో తక్కువ. అయితే ఈ విషయంలో బైక్ కమ్ కారు.. కారుల భద్రతను కల్పిస్తుంది. అదేంటి రెండు టైర్లే ఉన్నాయి కదా.. యాక్సిడెంట్ అయితే కింద పడిపోతాం కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ వాహనానికి ఉన్న ప్రత్యేకత అదే. ఇది అటానమస్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ వెహికల్.

అంటే ఎంత వేగంగా వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా గానీ, ఏ వాహనం వచ్చి గుద్దినా గానీ స్తంభంలా నిలబడి పోతుంది. ఏమీ కాదు. కింద పడిపోవడం ఉండదు. అసలు దీనికి స్టాండ్ వేయాల్సిన పనే లేదు. చాలా మంది కార్లలో వెళ్తున్నప్పుడు హెవీ ట్రాఫిక్ లో ఈ కారు వదిలేసి బైకు కొనుక్కుంటే బాగుణ్ణు అని అనుకుంటారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇరుకు సందుల్లో కూడా రయ్ రయ్ మంటూ దూసుకుపోవచ్చు. ఎంత స్పీడ్ లో వెళ్లినా గానీ కంట్రోల్ తప్పదు. దీని వల్ల ప్రమాదాలు అనేవి జరగవు. 45 డిగ్రీలు వంపు తిరిగినా గానీ ఈ బైక్ పడిపోదు. ఇది గైరో-స్టెబిలైజ్డ్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇది గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 273 కి.మీ. ప్రయాణిస్తుంది. దీని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది. కిలోవాట్ బ్యాటరీకి 22 కి.మీ. మైలేజ్ వస్తుంది. ఇందులో రెండు సీట్లు ఇచ్చారు. ఇద్దరు పెద్దవాళ్ళకి సరిపోతుంది. దీన్ని అమెరికాకి చెందిన లిట్ మోటార్స్ కంపెనీ ఈ విప్లవాత్మక బైకుని తయారు చేసింది. దీన్ని ప్రస్తుతం అమెరికాలో కొంతమంది వినియోగిస్తున్నారు. దీని ధరను 32 వేల డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. మన కరెన్సీ ప్రకారం 26 లక్షలపైనే. ఈ కంపెనీ ప్రస్తుతం ఇన్వెస్టర్ల కోసం ఎదురుచూస్తుంది. తమ వెబ్ సైట్ లో 50 లక్షల డాలర్ల పెట్టుబడిని కోరింది. ఇప్పటివరకూ 13,79,060 డాలర్లు వచ్చాయి. 50 లక్షల డాలర్లు అంటే 42 కోట్ల పెట్టుబడి. మన తెలుగు సినిమా స్టార్ హీరో తీసుకునే పారితోషికం అంత కూడా కాదు. కానీ ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత మంచి బైక్ తీసుకొస్తుండడం అంటే మామూలు విషయం కాదు.

Show comments