EMI, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తక్కువ వడ్డీకే లోన్ కావాలా? ప్రభుత్వ సంస్థ నుంచి బంపర్ ఆఫర్!

Loan: బ్యాంకులో లోన్ తీసుకొని కట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ‌ఎం‌ఐ, ప్రొసెసింగ్ ఫీజులు కట్టాల్సి ఉంటుంది.

Loan: బ్యాంకులో లోన్ తీసుకొని కట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ‌ఎం‌ఐ, ప్రొసెసింగ్ ఫీజులు కట్టాల్సి ఉంటుంది.

ప్రస్తుతం బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే బ్యాంకుల్లో పర్సనల్ లోన్ అంటే కష్టమే. ఎందుకంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి నెలా ఈఎంఐలు ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. లోన్ శాంక్షన్ కావాలంటే క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. ప్రాసెసింగ్ ఫీ కూడా కట్టాల్సి వస్తుంది. దీంతో మనకు పర్సనల్ లోన్ విషయంలో ఎక్కువ ఎక్కువ భారం పడుతుంది. అయితే ఇవన్నీ ఏం లేకుండా, నచ్చినప్పుడు లోన్ తిరిగి చెల్లించే అవకాశం భారం అనేది ఉండదు. అలాంటి సూపర్ అవకాశం కూడా ఒకటి ఉంది. ఈఎంఐలు బెడద, ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా నచ్చినప్పుడు మనం లోన్ తీర్చుకోవచ్చు. ఆ అవకాశాన్ని ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇస్తుంది. ఇక LIC ఆఫర్ చేస్తున్న ఈ లోన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీకు ఎల్ఐసీ పాలసీ ఉంటే దానిపై ఈజీగా లోన్ తీసుకోవచ్చు. ఇలా పాలసీపై తీసుకున్న రుణాలకు అసలు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇందులో వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ లోన్ ని మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే తిరిగి చెల్లించవచ్చు. మీ పాలసీ టెన్యూర్ ఉన్నంత వరకు మీరు ఎప్పుడైనా తిరిగి కట్టవచ్చు. ఇందులో వడ్డీని ఏడాదికి ఓసారి లెక్కిస్తారు. ఎల్ఐసీ పాలసీ పైన తీసుకునే లోన్లు చాలా సేఫ్. ఇవి సెక్యూర్డ్ లోన్స్ పరిధిలోకి వస్తాయి. అందుకే ఈ లోన్లపై వడ్డీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే, మీరు మీ పాలసీకి కట్టిన ప్రీమియంని బట్టి మీకు ఎంత లోన్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ లోన్లు అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ కూడా తక్కువ ఉంటుంది. కేవలం 3-5 రోజుల్లోనే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. అలాగే ఈ లోన్ తీసుకుంటే మీరు కట్టే పాలసీపై ఎఫెక్ట్ పడుతుందని భయపడాల్సిన అవసరం లేదు. మీ పాలసీ బెనిఫిట్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. అంటే ఇక్కడ మీరు రెండు బెనిఫిట్స్ పొందుతారు.

ఈ లోన్ కి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వసూలు చేయరు. ఈ లోన్ టెన్యూర్ 6 నెలల నుంచి మీ పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటుంది. మీరు మూడు విధాలుగా లోన్ తిరిగి కట్టవచ్చు. ఒకేసారి అసలు వడ్డీ కలిపి కట్టొచ్చు లేదా ప్రతి ఏడాది వడ్డీ చెల్లిస్తూ అసలు తరువాత కట్టవచ్చు లేదా పాలసీ మెచ్యూరిటీ సమయంలో క్లెయిమ్ డబ్బుతో పాటు అసలు కూడా సెటిల్ చేసుకోవచ్చు. అంటే అసలు పోగా మీకు రావలసిన మిగిలిన డబ్బులు మీకు ఇస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు LIC ఆఫీసులో కానీ, లేదా LIC ఏజెంట్ ని సంప్రదించి కానీ తెలుసుకోవచ్చు. ఇదీ సంగతి.. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments