LIC Jeevan Tarun Policy Premium Maturity Details: మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా చేయాలా? జీవన్ తరుణ్ స్కీమ్ మిస్ కావద్దు!

మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా చేయాలా? జీవన్ తరుణ్ స్కీమ్ మిస్ కావద్దు!

LIC Jeevan Tarun Policy: మీ పిల్లల ఉన్నత చదువులు, వివాహం వంటి ఖర్చుల కోసం ఒకే సారి భారీ మొత్తంలో పొందాలనుకుంటున్నారా.. అయితే మీకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. దీనిలో చేరి రోజుకు 171 రూపాయల పొదుపుతో 28 లక్షలు పొందవచ్చు. ఆ వివరాలు..

LIC Jeevan Tarun Policy: మీ పిల్లల ఉన్నత చదువులు, వివాహం వంటి ఖర్చుల కోసం ఒకే సారి భారీ మొత్తంలో పొందాలనుకుంటున్నారా.. అయితే మీకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. దీనిలో చేరి రోజుకు 171 రూపాయల పొదుపుతో 28 లక్షలు పొందవచ్చు. ఆ వివరాలు..

నేటి కాలంలో పొదుపు అనేది తప్పనిసరి అంశం అయ్యింది. ఎంత తక్కువ జీతం అయినా.. తక్కువ ఆదాయం ఉన్నావారైనా సరే.. పొదుపు చేయడం మాత్రం తప్పనిసరి. కారణం భవిష్యత్తులో ఎప్పుడు ఎలాంటి అవసరాలు వస్తాయో చెప్పలేం. ఇక కరోనా తర్వాత ప్రతి ఒక్కరు కచ్చితంగా ఎంతో కొంత పొదుపు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలు రకరకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అలాంటి వాటిల్లో ఒక పథకం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీనిలో చేరి.. రోజుకు 171 రూపాయలు పొదుపు చేస్తే.. ఏకంగా 28 లక్షలు రూపాయలు పొందవచ్చు. ఆ పథకం వివరాలు..

పిల్లలు పెద్దవాళ్లు అయ్యే కొద్ది ఖర్చులు పెరుగుతాయి. నేటి కాలంలో పిల్లల చదువు, పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహరంగా మారింది. చదువు సంగతి అలా ఉంచితే పెళ్లికి మాత్రం భారీగా డబ్బులు అవసరం అవుతాయి. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి ఒకేసారి అంత పెద్ద మొత్తంలో డబ్బులు సర్దుబాటు కావడం కష్టం. అందుకే చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లల బాల్యం నుంచే పొదుపు చేస్తున్నారు.  మీరు కూడా మీ అమ్మాయి పెళ్లి, ఉన్నత చదువుల కోసం పెద్ద మొత్తంలో కూడబెట్టాలని భావిస్తున్నారా.. అయితే మీకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ తీసుకొచ్చిన జీవన్ తరుణ్ పాలసీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

జీవన్ తరుణ్ పాలసీ..

ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ అనేది ప్రత్యేక పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూపొందించారు. పిల్లల వయసు 9 నెలల నుంచి గరిష్ఠంగా 12 ఏళ్ల మధ్య ఉన్న వారికి మాత్రమే ఈ పాలసీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పిల్లల వయసు 20 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ ఐదేళ్ల సమయంలో మీరు ప్రీమియం చెల్లించక్కర్లేదు. అలా మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చే నాటికి మీ పెట్టుబడి, బోనస్ వంటివి కలిపి పెద్ద మొత్తంలో మీ చేతికి అందుతుంది. ఆ మొత్తం మీ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి వంటి ఖర్చులకు ఉపయోగపడతాయి.

ఎల్ఐసీ అందిస్తోన్న ఈ జీవన్ తరుణ్ పాలసీలో కనీసం రూ.75000 బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఎంత అనే దానికి లిమిట్ లేదు. అలాగే ప్రీమియం చెల్లింపు కోసం మీకు అనువైన విధంగా నెల, 3, 6 నెలలు, లేదా ఏడాదికి ఒకే సారి చెల్లించే విధంగా మీకు అనువైన ఆప్షన్లు ఎంచుకోవచ్చు.  ఇందులో రూ.28 లక్షలు ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒక వ్యక్తి తన కూతురికి 2 సంవత్సరాలప్పటి నుంచే ఈ పథకంలో చేరి రోజుకు రూ.171 పొదుపు చేసుకుంటూ వెళ్లాడనుకుందా. అప్పుడు 18 ఏళ్లలో అతడి పెట్టుబడి రూ.10.89 లక్షలు అవుతుంది. దానిపైన బోనస్, ఇతర బెనిఫిట్స్ కలిపి మొత్తంగా చేతికి రూ. 28.24 లక్షలు అందేందుకు అవకాశం ఉంది. అయితే, జీవన్ తరుణ్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే కొనుగోలు చేయండ మంచిది. ఎందుకంటే కొన్ని నిబంధనలు మీ అవసరాలకు విరుద్ధంగా ఉండవచ్చు.
Show comments