LIC సూపర్ ప్లాన్స్.. వీటిల్లో చేరితే అప్పుల బాధలు తీరినట్టే!

LIC సూపర్ ప్లాన్స్.. వీటిల్లో చేరితే అప్పుల బాధలు తీరినట్టే!

LIC Yuva term Digi term Credit life: ఎల్ఐసీ పాలసీదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. తాజాగా నాలుగు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. ఈ పాలసీల్లో చేరితే అప్పుల బాధలు తీరిపోతాయ్.

LIC Yuva term Digi term Credit life: ఎల్ఐసీ పాలసీదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. తాజాగా నాలుగు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. ఈ పాలసీల్లో చేరితే అప్పుల బాధలు తీరిపోతాయ్.

దిగ్గజ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రవేశ పెట్టి అమలు చేస్తూ ఉంటుంది ఎల్ఐసీ. ప్రభుత్వానికి చెందిన సంస్థ కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అదే సమయంలో గ్యారంటీ రిటర్స్స్ పొందొచ్చు. ఎల్ఐసీలో పాలసీ తీసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించినట్లు అవుతుంది. ఈ క్రమంలో మరో కొత్త పాలసీలను తీసుకొచ్చింది ఎల్ఐసీ. ఈ పాలసీల్లో చేరితే అప్పుల బాధలు తీర్చుకోవచ్చు. ఇంతకీ ఆ పాలసీలు ఏంటి? ప్రయోజనాలు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసీ నాలుగు కొత్త టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకొచ్చింది. యువ టర్మ్‌, డిజి టర్మ్‌, యువ క్రెడిట్‌ లైఫ్‌, డిజి క్రెడిట్‌ లైఫ్‌ పేరిట వీటిని లాంచ్‌ చేసింది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కల్పించడంతో పాటు, లోన్‌ రీపేమెంట్స్‌ విషయంలో ఆర్థిక భద్రత కల్పించడం ఈ పాలసీల ముఖ్య ఉద్దేశమని ఎల్‌ఐసీ తెలిపింది. ఎల్‌ఐసీ యువ టర్మ్‌/ డిజిటర్మ్‌ అనేది నాన్‌ పార్టిసిపేటింగ్‌, నాన్‌-లింక్డ్‌, లైఫ్‌, ఇండివిడ్యువల్‌, ప్యూర్‌ రిస్క్‌ ప్లాన్‌. పాలసీ కాలంలో పాలసీదారుడికి ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబానికి ఆర్థిక రక్షణ ఇవ్వడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని ఎల్‌ఐసీ వెల్లడించింది.

18-45 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు ఈ పాలసీలో చేరొచ్చు. కనీస సమ్‌ అష్యూర్డ్‌ రూ.50 లక్షలు. గరిష్ఠంగా రూ.5 కోట్ల బీమా హామీతో పాలసీ తీసుకోవచ్చు. యవ క్రెడిట్‌ లైఫ్‌/ డిజి క్రెడిట్‌ లైఫ్‌ కూడా.. నాన్ పార్టిసిపేటింగ్‌, నాన్‌ లింక్డ్‌, లైఫ్‌, ఇండివిడ్యువల్‌, ప్యూర్‌ రిస్క్‌ ప్లాన్. 18-45 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు ఈ పాలసీలో చేరొచ్చు. బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌ రూ.50 లక్షలు. గరిష్ఠంగా రూ. 5 కోట్ల వరకు తీసుకోవచ్చు. అప్పుల భారం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. ఈ పాలసీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Show comments