lectrix lxs 3.0 electric scooter: బడ్జెట్ ధరలో మరో కొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 98KM రేంజ్

బడ్జెట్ ధరలో మరో కొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 98KM రేంజ్

lectrix lxs 3.0 electric scooter: మార్కెట్ లోకి మారో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 98కి.మీల వరకు ప్రయాణించగలదు.

lectrix lxs 3.0 electric scooter: మార్కెట్ లోకి మారో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 98కి.మీల వరకు ప్రయాణించగలదు.

వరల్డ్ వైడ్ గా ఈవీలకు ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు సైతం ఈవీలను ప్రోత్సహిస్తున్నాయి. పెట్రోల్ ధరల భారం తప్పించుకునేందుకు ఈవీలను కొనుగోలు చేస్తున్నారు వాహనదారులు. క్రేజీ ఫీచర్లు, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దూరం ప్రయాణించే సౌలభ్యం ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈక్రమంలో ఈవీ ప్రియుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. లెక్ట్రిక్స్ సంస్థ లెక్ట్రిక్స్‌ ఎల్‌ఎక్స్‌ఎస్‌ 2.0ను లాంఛ్ చేసింది.

ఈ కొత్త మోడల్ లెక్ట్రిక్స్ ఈవీ2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 98 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఇది గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర రూ. 84999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ల (2.9bhp) బీఎల్డీసీ హబ్ మోటార్‌ని కలిగి ఉంది. లెక్ట్రిక్ lxs 2.0 ఇ-స్కూటర్‌లో 25 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్ స్పేస్, 90/110 ఫ్రంట్, 110/90 వెనుక భాగంలో 10-అంగుళాల టైర్లు మరియు ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఐదు కలర్స్ లో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ రెడ్, అజుర్ బ్లూ, వైట్, జింగ్ బ్లాక్, మిలిటరీ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇక ఇదే కంపెనీ నుంచి ఎల్ ఎక్స్ ఎస్ 3.0 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 130కిలోమీర్ల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఇది గంటకు 54కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తుందని తెలిపింది. బడ్జెట్ ధరల్లో ఈవీ కోరుకునే వారికి ఈ ఈవీలు బెస్ట్ అంటున్నారు నిపుణులు.

Show comments