Real Estate: 10 లక్షలు పెట్టుబడి పెడితే కోటి రూపాయలు తెచ్చే స్థలాలు! ఆ ఏరియా ఎక్కడంటే?

10 లక్షలు పెట్టుబడి పెడితే కోటి రూపాయలు తెచ్చే స్థలాలు! ఆ ఏరియా ఎక్కడంటే?

If Invest 10 Lakhs On Plot In Shadnagar Bangalore Highway will become 1 Crore Says Real Estate Experts: కేవలం డబ్బు సంపాదించాలి అనుకునేవారు రియల్ ఎస్టేట్ ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్తారు. మీరు కూడా రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాలి అని అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. ఇప్పుడు 10 లక్షలు ఆ ఏరియాలోని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

If Invest 10 Lakhs On Plot In Shadnagar Bangalore Highway will become 1 Crore Says Real Estate Experts: కేవలం డబ్బు సంపాదించాలి అనుకునేవారు రియల్ ఎస్టేట్ ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్తారు. మీరు కూడా రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాలి అని అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. ఇప్పుడు 10 లక్షలు ఆ ఏరియాలోని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో ఉన్న శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే.. ఇలా ఈ హైవేల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లాభమే. కానీ ఎక్కువ లాభం రావాలంటే మాత్రం బెంగళూరు హైవే ఒకటే ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ముంబై హైవే, విజయవాడ హైవేలు చూసుకుంటే వీటికి ఆర్టీసీ ద్వారా రోడ్ కనెక్టివిటీ ఒకటే ఉంది. వరంగల్ హైవే చూసుకుంటే ఆర్టీసీ, రైల్వే ద్వారా కనెక్టివిటీ ఉంది. కానీ ఒక్క బెంగళూరు హైవేకి మాత్రమే రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది ఈ హైవే. మరోవైపు మహబూబ్ నగర్ వరకూ ఎంఎంటీఎస్ ట్రాక్ కూడా పూర్తయ్యింది. అంతకు ముందు ఫలక్ నుమా వరకే ఎంఎంటీఎస్ రైళ్లు నడిచేవి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్న ఉందానగర్ వరకూ నడుస్తున్నాయి.

శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకూ మెట్రో రైలు ప్రతిపాదన కూడా ఉంది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ కి కూడా మెట్రో రైలు ప్రతిపాదన ఉంది. మెట్రో రైలు వస్తే కనుక హైదరాబాద్ లో పని చేసే ఉద్యోగులకు డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. స్థానికంగా షాద్ నగర్ లో కూడా అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్ టెల్ డేటా సెంటర్లు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ పాఠశాలలు, అంతర్జాతీయ హాస్పిటల్ వంటివి ఉన్నాయి. పలు కంపెనీలు, పరిశ్రమలు కూడా రానున్నాయి. భవిష్యత్తులో లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.  

హైవేకి 2, 3 కి.మీ. దూరంలో తక్కువ ధరకి స్థలాలు దొరకడం కష్టం. కానీ షాద్ నగర్ లో స్థలాలు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. వచ్చే పదేళ్లలో ఈ ప్రాంతంలో కంపెనీలు, పరిశ్రమలు పూర్తయ్యి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. ఉద్యోగులు ఇక్కడ స్థిరపడతారని.. ఆ సమయంలో ఇక్కడ నివాస స్థలాలకు, ఇండ్లకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు స్థలాల ధరలు పది రెట్లు పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏ హైవే చూసుకున్నా గానీ బెంగళూరు హైవేలో షాద్ నగర్ ఏరియాలో స్థలాల మీద వచ్చే లాభం మరెక్కడా రాదని చెబుతున్నారు. ప్రస్తుతం షాద్ నగర్ లో చదరపు అడుగు స్థలం రూ. 1800గా ఉంది. అంటే గజం రూ. 16 వేలు పడుతుంది. ఇప్పుడు 10 లక్షలు పెట్టుబడి పెట్టి స్థలం కొంటే దాని విలువ పదేళ్ల తర్వాత కోటి రూపాయల పైనే అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. పదేళ్లలో 10 రెట్లు పెరుగుతుందని అంటున్నారు. అంటే ఏడాదికి 10 లక్షలు సంపాదించినట్టే అవుతుందని చెబుతున్నారు. 

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.

Show comments