Tirupathi Rao
risk factors of Not In Use Bank Accounts: బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి వాటిని వాడకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే రిస్క్ లో పడతారు.
risk factors of Not In Use Bank Accounts: బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి వాటిని వాడకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే రిస్క్ లో పడతారు.
Tirupathi Rao
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. విద్యార్థులు కూడా చదువుకునే రోజుల్లోనే బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఉద్యోగులు కూడా సాలరీ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అలాగే ఉద్యోగం మారినప్పుడు వేరే అకౌంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఒక్కోసారి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు మెయిన్ టైన్ చేస్తుంటారు. కానీ, ఒక్కోసారి కొన్ని బ్యాంకు అకౌంట్లను నిరుపయోగంగా వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీరు పెద్ద రిస్క్ లో పడే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా మందికి ఆ విషయం కూడా తెలియదు. జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు.
బ్యాంకు ఖాతాలు అనేవి ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయాయి. అందరు వారి వారి అవసరాలను బట్టి సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ అంటూ బ్యాంకు ఖాతాలు తీసుకుంటున్నారు. పైగా బ్యాంకులు కూడా ఉచితంగానే బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసేవి. అలాంటి సమయంలో పౌరులు చాలానే ఖాతాలు ఓపెన్ చేశారు. ఆ తర్వాత వారి అవసరాలను బట్టి ఆ బ్యాంకు ఖాతలను వాడటం మానేస్తున్నారు. చాలామంది అలాగే చేస్తున్నారు. కానీ, అలా చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరగచ్చు. మీ మీద ఆర్థిక నేరాల ఆరోపణలు రావచ్చు. ఆఖరికి మీరు ఆ వాడని బ్యాంకు ఖాతాల వల్ల జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు.
సాధారణంగా ఇప్పుడు ఆర్థిక నేరాలు ఎక్కువ అయిపోయాయి. అందరూ డిజిటల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. అలాంటి వారు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి వాటిని వాడటం మానేస్తే మీ బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు టార్గెట్ కావచ్చు. అలా మీ ఖాతాను ఎవరైనా మనీ లాండరింగ్ కోసం ఉపయోగించే ఆస్కారం కూడా ఉంది. అలాంటి సమయంలో మీరు అందుకు జవాబుదారీ అవుతారు. మీకు తెలియకుండా మీ ఖాతాను ఇల్లీగల్ పనులకు వాడితే వాటి ప్రభావం వల్ల మీరు కూడా జైలుకు వెళ్లాల్సి రావచ్చు. నిరుపయోగంగా ఉన్న బ్యాంకు ఖాతాను వెంటనే క్లోజ్ చేసుకోవడం మంచిది.
ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ కింద మీకు అదికంగా ఛార్జెస్ కూడా పడే ఛాన్స్ ఉంది. కాబట్టి వాడని ఖాతాలను క్లోజ్ చేసుకోండి. అలాగే మీకు సంబంధం లేకుండా మీ ఖాతా నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం వల్ల ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ జరిగినా కూడా అది మీ మీదకు రాకుండా ఉంటుంది. అందుకే అకౌంట్లో డబ్బులు పడితే వెంటనే ఫిర్యాదు చేయండి. ముఖ్యంగా వాడని బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయించండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెబర్స్ తో కూడా షేర్ చేసుకుని.. వారిని కూడా అలర్ట్ చేయండి.