Dharani
Kisan Credit Card-Rs 3 Lakh Loan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు ఏకంగా 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఆ వివరాలు...
Kisan Credit Card-Rs 3 Lakh Loan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు ఏకంగా 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఆ వివరాలు...
Dharani
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల కోసం అనేక పథకాలను తీసుకొస్తున్నాయి. పెట్టుబడి సాయం మొదలు, మద్దతు ధర కల్పించడం, వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీ ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. వీటితో పాటుగా అన్నదాతలు పంట చేతి కొచ్చే వరకు పెట్టబడి, సాగు ఖర్చు వంటి అవసరాల కోసం చేతిలో డబ్బుల లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. ఇలా తీసుకునే డబ్బుల మీద భారీ ఎత్తున వడ్డీ వసూలు చేస్తుంటారు. ఆ తర్వాత పంట చేతికొచ్చిన.. ఆదాయం.. వడ్డీ వ్యాపారుల పాలవుతుంది. అదుగో రైతులను అలాంటి సమస్యల బారినపడకుండా చూడటం కేంద్రం వారి కోసం సరికొత్త స్కీమ్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా అన్నదాతలు రూ.3లక్షల వరకు లోన్ తీసుకొవచ్చు. అది కూడా 4 శాతం వడ్డీకే. ఇంతకు ఆ స్కీమ్ ఏంటి.. దానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు పంట సాగు కోసం బ్యాంకుల వద్ద నుంచి సులభంగా లోన్ తీసుకోవచ్చు. ఒకసారి ఈ కార్డు తీసుకుంటే 5 ఏళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఐదేళ్లలో రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్ల మీద 7 శాతం వడ్డీనే వసూలు చేస్తుంది. అయితే లోన్ తీసుకున్న ఏడాది లోపు తిరిగి చెల్లిస్తే.. 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే 4 శాతానికే లోన్స్ తీసుకోవచ్చు.
దేశంలోని అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తాయి. ఆన్‌లైన్ ద్వారా కూడా దీన్ని తీసుకోవచ్చు. భూ యజమానులు, కౌలు రైతులు, లీజుకు తీసుకున్న వారు, పౌల్టీ, మత్స్యకార రైతులు సైతం ఈ కార్డు తీసుకుని లోన్ తెచ్చుకోవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకునే రైతులు.. బ్యాంకుకు వెళ్లినట్లయితే అర్హతలు, కార్డు వివరాలు, ఎంత లోన్ ఇస్తారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత కేసీసీ అప్లికేషన్ ఫారం నింపి ఇవ్వాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు వంటి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే భూమికి సంబంధించిన పత్రాల కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు మీ ఫొటో కూడా ఇవ్వాలి.
ఈ కార్డు ద్వారా ఐదేళ్ల పాటు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ పరిమితి పెంచుకోవాలంటే కార్డు తీసుకునేప్పుడే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. అలా అయితేనే లోన్ అమౌంట్ మొత్తాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇక తొలిసారి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మీ లోన్ పరిమితి పెంచేందుకు మొగ్గుచూపిస్తాయి. పంట పెట్టుబడి కోసం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే దానిపైన ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది.