P Venkatesh
కొత్త కారు కొనాలని ఉన్న ధరలు ఎక్కువగా ఉండడంతో కొనలేక పోతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కియా కొత్త కార్లను అద్దెకు తీసుకుని వాడుకోవచ్చు. నెలకు అద్దె ఎంత ఉందంటే?
కొత్త కారు కొనాలని ఉన్న ధరలు ఎక్కువగా ఉండడంతో కొనలేక పోతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కియా కొత్త కార్లను అద్దెకు తీసుకుని వాడుకోవచ్చు. నెలకు అద్దె ఎంత ఉందంటే?
P Venkatesh
కారులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి సొంత కారు ఉండాలని కలలు కంటుంటారు. కానీ కార్ల ధరలు లక్షల్లో ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. దీంతో వారి కల కలగానే మిగిలిపోతుంది. ఇటీవల దాదాపు దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు కార్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో సొంత కారు ఉండాలనే కల అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుంది. అయితే ఇలాంటి వారికి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా గుడ్ న్యూస్ అందించింది. కొత్త కార్లను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమైంది. తక్కువ ధరకే అద్దెకు కొత్త కియా కార్లను తీసుకుని మీ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇంతకీ నెలకు అద్దె ఎంత కట్టాలంటే?
కొత్త కారు కొనాలంటే కనీసం 5 లక్షలైనా ఉండాల్సిందే. కారు కొన్న తర్వాత నిర్వహణ ఖర్చుల భారం కూడా మోయాల్సి ఉంటుంది. అంత డబ్బు పెట్టి కొన్నాక మరో కొత్త మోడల్ కారును తీసుకోవాలంటే పాత కారును అమ్మాల్సివస్తే సరైన ధర రాక లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే మీకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండానే కొత్త కారును అద్దెకు తీసుకుని ఎంచక్కా వాడుకోవచ్చు. ‘కియా లీజ్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి కియా తెరలేపింది. ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కార్ల లీజ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి దశ కింద హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో లీజుకు కియా కార్లు అందుబాటులో ఉండనున్నాయి.
అద్దె చెల్లించి మీకు నచ్చిన కియా కారును లీజుకు తీసుకుని వాడుకోవచ్చు. లీజు కాలం ముగిసిన తర్వాత కారును తిరిగి ఇచ్చేయవచ్చు. మళ్లీ కారు అవసరముంటే మరో కొత్త మోడల్ ను రెంట్ కు తీసుకోవచ్చు. 24 నుంచి 60 నెలలపాటు కియా కార్లను లీజ్ కు తీసుకోవచ్చు. అద్దె కార్లకు ఎలాంటి డౌన్ పేమెంట్ ను చెల్లించాల్సిన అవసరం లేదు. కియా కార్ల కనీస నెలవారీ లీజు ధరలు పరిశీలిస్తే.. సోనెట్-రూ.21,900, కారెన్స్-రూ. 28,800, సెల్టోస్-రూ.28,900గా ఉంది. ఈ అద్దెలను చెల్లించి కొత్త కియా కారును అద్దెకు తీసుకుని మీ అవసరాలకు వాడుకోవచ్చు.