జియో నుంచి 4G ఫీచర్ ఫోన్స్.. ధర కేవలం రూ. 1099.. UPI పేమెంట్స్ చేయొచ్చు

Jio Feature Phones: జియో మరో కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 1099కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ల ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు.

Jio Feature Phones: జియో మరో కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 1099కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ల ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు.

టెలికాం రంగంలో సంచలనాలకు మారు పేరు రిలయన్స్ జియో. టెలికాం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఫ్రీ సిమ్, ఫ్రీ డేటా అందించి మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసిరింది జియో. ఆ తర్వాత తక్కువ ధరలకే కళ్లు చెదిరే బెనిఫిట్స్ అందిస్తూ రిచార్జ్ ప్లాన్స్ ను ప్రవేశ పెట్టింది. దీంతో మొబైల్ వినియోగదారులు జియో నెట్ వర్క్ కే ప్రియారిటీ ఇచ్చారు. డేటా స్పీడ్ కూడా ఎక్కువగా ఉండడంతో జియోకు కస్టమర్ల నుంచి ఆదరణ పెరిగిపోయింది. దీంతో జియో నెట్ వర్క్ దగ్గరే ఆగిపోకుండా ఫోన్స్, ల్యాప్ టాప్స్ ను రూపొందించి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

జియో భారత్ పేరిట ఫీచర్ ఫోన్లను ప్రవేశపెట్టి గ్రామీణ ప్రజలకు మరింత చేరువైంది. చౌక ధరలకే ఫీచర్ ఫోన్లు లభిస్తుండడం, లేటెస్ట్ ఫీచర్స్ అందించడంతో ఫీచర్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో జియో భారత్ మరో కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. జియోభారత్‌ V3, జియోభారత్‌ V4 పేరుతో 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ల ధర కేవలం రూ. 1099 మాత్రమే. ఈ ఫీచర్ ఫోన్లలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే యూపీఐ పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. లైవ్ టీవీ చానల్స్ ను చూడొచ్చు. ఈ ఫోన్‌లు 23 భాషలను సపోర్టు చేయనున్నాయి.

జియోభారత్‌ V3 ఫోన్‌ను స్టైల్‌ సెంట్రిక్‌ డివైస్‌గా లాంచ్‌ చేశారు. అదే జియోభారత్‌ V4 డిజైన్ సరళంగా ఉంటుంది. జియోభారత్‌ V3, V4 ఫీచర్‌ఫోన్‌లు జియోఛాట్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. దీనితో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ మెసెజ్‌, ఫోటో షేరింగ్‌, గ్రూప్‌ మెసేజింగ్‌ ఆప్షన్‌లను పొందవచ్చు. ఈ రెండు ఫోన్‌లు 1000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా.. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు స్టోరేజీని పొందవచ్చు. ఈ ఫోన్లు జియోటీవీ యాప్‌ను సపోర్టు చేస్తాయి. 455 లైవ్‌ టీవీ ఛానళ్లు వీక్షించేందుకు వీలుంటుందని జియో తెలిపింది.

వినియోగదారులు తమకు ఇష్టమైన షోలు, వార్తలు, క్రీడలను ఆస్వాదించవచ్చు. అలాగే.. ఈ ఫోన్‌లు జియోపే యాప్‌ సపోర్టును కలిగి ఉంటాయి. ఫలితంగా యూపీఐ పేమెంట్‌లు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ల కోసం జియో భారత్ ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లకు రూ.123 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ తో 28 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్, 14జీబీ డేటా వస్తుంది. ఈ ఫోన్‌లు జియోమార్ట్‌, అమెజాన్‌ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మరి తక్కువ ధరకే క్రేజీ ఫీచర్లతో జియో భారత్ తీసుకొచ్చిన 4జీ ఫీచర్ ఫోన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments