Keerthi
Jio: ఇటీవలే దేశవ్యాప్తంగా జియో నెట్ వర్క్ సాంకేతిక సమస్య కారణంగా సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిదే. దీంతో ఈ జియో సేవలు పొందుతున్న యూజర్స్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులకు తాజాగా జియో తాజాగా కాంప్లిమెంటరీ ప్లాన్ అందిస్తోంది. ఇంతకీ అదేమిటంటే..
Jio: ఇటీవలే దేశవ్యాప్తంగా జియో నెట్ వర్క్ సాంకేతిక సమస్య కారణంగా సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిదే. దీంతో ఈ జియో సేవలు పొందుతున్న యూజర్స్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులకు తాజాగా జియో తాజాగా కాంప్లిమెంటరీ ప్లాన్ అందిస్తోంది. ఇంతకీ అదేమిటంటే..
Keerthi
మొబైల్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకోవడంలో రిలయన్స్ జియోకు సాటి ఏదీ లేదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జియో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడమే కాకుండా.. ఆకర్షణీయమైన ఆఫర్స్ ను తరుచు ప్రకటిస్తూ ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ జియో నెట్ వర్క్ సేవలకు అంతరాయం కలుగుతుంటుంది. ఈ క్రమంలోనే.. గత రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా జియోకు సంబంధించిన అన్ని సేవలకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ అంతరాయంపై దేశవ్యాప్తంగా యూజర్లు పెద్ద ఎత్తునే సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఈ నెట్ వర్క్ అంతరాయం పై స్పందించిన జియో సంస్థ తాజాగా తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో కస్టమర్లందరికి కాంప్లిమెంటరీ ప్లాన్ ను అందిస్తోంది. ఇంతకీ అదేమిటంటే..
ఇటీవలే దేశవ్యాప్తంగా జియో నెట్ వర్క్ సాంకేతిక సమస్య కారణంగా సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిదే. దీంతో ఈ జియో సేవలు పొందుతున్న యూజర్స్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులకు తాజాగా జియో తాజాగా కాంప్లిమెంటరీ ప్లాన్ అందిస్తోంది. మరి అదేంటో కాదండి.. రెండు రోజుల పాటు ఉచితంగా అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ను ఇవ్వనున్నట్లు జియో వెల్లడించింది. ఈ మేరకు జియో సంస్థ పలువురు కస్టమర్లకు టెక్ట్స్ రూపంలో సందేశం కూడా పంపింది. కాగా, అందులో. డియర్ జియో యూజర్స్, దురదృష్టవశాత్తు మంగళవారం( సెప్టెంబర్ 17-92024) ఉదయం నుంచి రాత్రి వరకు జియో సేవల్లలో సంకేతికం సమస్యలు తలెత్తాయి. దీంతో మా యూజర్స్ అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే మేము మీ నెంబరుకు 2 రోజుల కాంప్లిమెంటరీ అన్ లిమిటెడ్ ప్లాన్ ను అందిస్తున్నాం. ఈ ప్లాన్ యాక్టివేట్ అయిన వెంటనే దాని ప్రయోజనాలను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. మేము జియోతో మీ అనుభవానికి విలువ ఇస్తాము’’ అని జియో అందులో పేర్కొంది.
ఇకపోతే సెప్టెంబర్ 17న జియో సేవలు అంతరాయం కలిగిన నగరాలు ఎక్కువగా.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాసిక్, కోల్ కతా, పాట్నా, గౌహతి సహా మరి కొన్ని నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే అంతరాయానికి గల కారణం.. ఈ జియో ఐడీసీ డేటా సెంటర్ లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించిన కారణమని తెలిసింది. అందుల్ల దేశ వ్యాప్తంగా జియో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరి, రిలియన్స్ జియో తమ కస్టమర్లకు అందించిన ఈ బంఫర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.