జియో మరో సంచలనం.. రూ.11తో కొత్త రీచార్జ్ ప్లాన్.. లేట్ చేయకండి

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. క్రేజీ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 11 తో చౌకైన ప్లాన్ ను ప్రకటించింది. ఇప్పుడే రీచార్జ్ చేసుకోండి.

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. క్రేజీ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 11 తో చౌకైన ప్లాన్ ను ప్రకటించింది. ఇప్పుడే రీచార్జ్ చేసుకోండి.

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. జియో టెలికాం సెక్టార్ లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే టాప్ పొజిషన్ లోకి దూసుకెళ్లింది. కోట్లాది మంది కస్టమర్లతో రారాజుగా కొనసాగుతున్నది. అప్పటి వరకు ఎదురన్నదే లేకుండా ఎదుగుతున్న ఎయిర్ టెల్, ఐడియాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది జియో. ఫ్రీ సిమ్ కార్డ్ ఇస్తూ ఉచిత డేటా, కాలింగ్ సదుపాయం కల్పిస్తూ మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీఇచ్చింది. నెట్ వర్క్ స్పీడ్ బాగుండడంతో జియోకు ఆదరణ పెరిగింది. తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్ అందిస్తూ కస్టమర్లను ఆకర్షించింది. అదిరిపోయే బెనిఫిట్స్ తో అదరగొడుతున్నది. కాగా ఈ ఏడాది జులైలో టారిఫ్ ధరలు పెంచిన తర్వాత యూజర్లు జియోపై అసహనం వ్యక్తం చేశారు.

తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్ అందించే నెట్ వర్క్ ల వైపు మొగ్గు చూపారు. దీంతో రిలయన్స్ జియో దిగొచ్చింది. కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తున్నది. ఇతర కంపెనీలతో పోలిస్తే జియో రీఛార్జ్ ప్లాన్ ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. కంపెనీ అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలతో పాటు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్స్ కూడా రీఛార్జ్ ప్లాన్ ప్యాకేజీతో పాటు అందిస్తోంది. ఈ క్రమంలో జియో యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా మరో కొత్త బూస్టర్‌ ప్లాన్ ను పరిచయం చేసింది. కేవలం రూ. 11తో రీచార్జ్ చేసుకుంటే చాలు అదిరే బెనిఫిట్ పొందొచ్చు. 11 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 10 జీబీ 4జీ డేటా అందిస్తోంది.

డేటా ఎక్కువగా వినియోగించుకునే వారికి ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గంటలు గంటలు ఫోన్ లో గడిపేవారికి ఈ కొత్త ప్లాన్ యూజ్ ఫుల్ గా ఉండనున్నది. అయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ రోజులో, నెలలో కాదండోయ్. ఒక గంట పాటు వ్యాలిడటీని కలిగి ఉంటుంది. రీఛార్జ్‌ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్‌ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ ఆఫర్‌ కేవలం ఇంటర్‌నెట్‌ సర్వీసుకే పరిమతం. వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను ఇది అందించదు.

నిర్ణీత సమయంపాటు హైస్పీడ్‌ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్‌ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. లార్జ్‌ ఫైల్స్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు, డౌన్‌లోడ్‌ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్‌ ప్రయోజనకరంగా ఉంటుందని జియో తెలిపింది. ఇంత చౌక ధరలో 10జీబీ 4జీ డేటా అందించే ప్లాన్ మరే టెలికాం సంస్థలో లేదు. డేటా ఎక్కువగా వినియోగించే వారు ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి. మరి జియో ప్రకటించిన రూ. 11 కొత్త ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments