జియో యూజర్స్‌కి షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్! బాదుడే బాదుడు!

Jio Hikes Tariff Plans: రిలయన్స్ జియో తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ప్లాన్స్ పై ధరలను భారీగా పెంచేసింది.

Jio Hikes Tariff Plans: రిలయన్స్ జియో తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ప్లాన్స్ పై ధరలను భారీగా పెంచేసింది.

జియో తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్స్ ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ పై ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు ఇలా భారీగా పెంచేసింది. డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ పై, అలానే పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ పై కూడా ధరలు పెంచుతున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. 5జీ డేటా కోసం ఎదురుచూసే యూజర్స్ కి కూడా మెలిక పెట్టింది. మరి ఏ ప్లాన్ ఎంత వరకూ పెరిగింది? ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి? ఎప్పటి నుంచి ఈ ప్లాన్ ధరలు అమలు అవుతాయి వంటి పూర్తి వివరాలు మీ కోసం.   

పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే:

నెలవారీ రీఛార్జ్ ప్లాన్స్ పై పెరిగిన ధరలు:

  • నెలకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 155 రూపాయల ప్లాన్ ని ఇప్పుడు 189 రూపాయలకు పెంచింది. 34 రూపాయలు పెంచింది. 
  • రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 209 రూపాయల ప్లాన్ ని 249 రూపాయలకు పెంచేసింది. 
  • రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 239 రూపాయల ప్లాన్ ని 299 రూపాయలు చేసింది. 
  • రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 299 రూపాయల ప్లాన్ ని 349 రూపాయలకు పెంచేసింది. 
  • రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 349 రూపాయల ప్లాన్ ని 399 రూపాయలు చేసింది. 
  • రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 399 రూపాయల ప్లాన్ ని 449 రూపాయలకు పెంచేసింది. 

2 నెలల ప్లాన్ పై పెరిగిన ధరలు:

  • రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 56 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 479 రూపాయల ప్లాన్ ని 579 రూపాయలకు పెంచేసింది. 
  • రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 56 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 533 రూపాయల ప్లాన్ ని 629 రూపాయలకు పెంచేసింది. 

3 నెలల ప్లాన్ పై పెరిగిన ధరలు:

  • నెల మొత్తంలో 6 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 84 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 395 రూపాయల ప్లాన్ ని ఇప్పుడు 479 రూపాయలు చేసింది. 
  • రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 84 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 666 రూపాయల ప్లాన్ ని ఇప్పుడు 799 రూపాయలకు పెంచేసింది. 
  • నెల మొత్తంలో 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 84 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 719 రూపాయల ప్లాన్ ని ఇప్పుడు 859 రూపాయలు చేసింది. 
  •  రోజుకు 3 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, మెసేజులతో 84 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 999 రూపాయల ప్లాన్ ని ఇప్పుడు 1199 రూపాయలకు పెంచేసింది. 

ఏడాది ప్లాన్ పై పెరిగిన ధరలు:

  • ఏడాదికి 24 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 336 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 1599 రూపాయల ప్లాన్ ని ఇప్పుడు 1899 రూపాయలు చేసింది. 
  • రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో 365 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 2999 రూపాయల ప్లాన్ ని ఇప్పుడు 3599 రూపాయలు చేసింది. 

డేటా యాడ్-ఆన్ ప్లాన్ పై పెరిగిన ధరలు:

  • 1 జీబీ అదనపు డేటాపై 15 రూపాయలుగా ఉన్న బేస్ ప్లాన్ ని 19 రూపాయలు చేసింది. 
  • 2 జీబీ అదనపు డేటాపై 25 రూపాయలుగా ఉన్న బేస్ ప్లాన్ ని 29 రూపాయలు చేసింది. 
  • 6 జీబీ అదనపు డేటాపై 61 రూపాయలుగా ఉన్న బేస్ ప్లాన్ ని 69 రూపాయలు చేసింది. 

పోస్ట్ పెయిడ్ ప్లాన్ పై పెరిగిన ధరలు:

  • నెల మొత్తం మీద 30 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో ఉన్న 299 రూపాయల బిల్ సైకిల్ ప్లాన్ ని ఇప్పుడు 349 రూపాయలు చేసింది. 
  • నెల మొత్తం మీద 75 జీబీ డేటా, అపరిమిత కాల్స్, అపరిమిత మెసేజులతో ఉన్న 399 రూపాయల బిల్ సైకిల్ ప్లాన్ ని ఇప్పుడు 449 రూపాయలు చేసింది. 

ఈ ప్లాన్స్ పై జియో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలకు సంబంధించి కొత్త ప్లాన్స్ వచ్చే నెల జూలై 3 నుంచి అమలవుతాయని తెలిపింది. అయితే రోజుకు 2 జీబీ లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్స్ పై మాత్రమే అపరిమిత 5జీ డేటా వస్తుందని జియో సంస్థ తెలిపింది. కాల్స్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ఫర్ సహా పలు ఇతర ప్రయోజనాలను అందించే జియో సేఫ్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ యాప్ కోసం నెలకు 199 రూపాయల ప్లాన్ ని అందిస్తున్నామని తెలిపింది. అలానే ఏఐ పవర్ జియో ట్రాన్స్ లేట్ యాప్ ని నెలకు 99 రూపాయల సబ్ స్క్రిప్షన్ తో అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజులు, టెక్స్ట్, ఇమేజ్ లని ట్రాన్స్ లేషన్ చేసుకోవచ్చు. అయితే జియో కస్టమర్లు నెలకు 298 రూపాయల విలువ చేసే ఈ రెండు యాప్స్ ని ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చునని తెలిపింది.

Show comments