Jio Plans: రూ.175 ప్లాన్‌తో సోనీ లివ్, జీ5 సహా 12 ఓటీటీ యాప్స్!

Jio Entertainment Plans: రూ.175 ప్లాన్‌తో సోనీ లివ్, జీ5 సహా 12 ఓటీటీ యాప్స్!

Jio Entertainment Plans: ఓటీటీ ప్రియుల కోసం జియో బెస్ట్ ప్లాన్ ని తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ప్లాన్ ని అందిస్తుంది. సోనీ లివ్, జీ5 సహా 12 ఓటీటీ యాప్స్ ని ఉచితంగా పొందవచ్చు.

Jio Entertainment Plans: ఓటీటీ ప్రియుల కోసం జియో బెస్ట్ ప్లాన్ ని తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ప్లాన్ ని అందిస్తుంది. సోనీ లివ్, జీ5 సహా 12 ఓటీటీ యాప్స్ ని ఉచితంగా పొందవచ్చు.

ఓటీటీ ప్రియుల కోసం జియో బెస్ట్ ప్లాన్ ని తీసుకొచ్చింది. తక్కువ ధరకే ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఇటీవల జియో టారిఫ్ రేట్లను పెంచడంతో చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ కి వెళ్లిపోయారు. అయితే యూజర్స్ ని ఆకర్షించేందుకు సరసమైన ధరకే కొన్ని ప్లాన్స్ ని తీసుకొచ్చింది. వాటిలో ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ ప్లాన్ ఒకటి. ఇది ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. 175 రూపాయల రీఛార్జ్ తో 12 రకాల ఓటీటీ యాప్స్ ని ఉచితంగా పొందవచ్చు. అలానే 10 జీబీ అన్ లిమిటెడ్ డేటా పొందవచ్చు. ఎలాంటి డైలీ లిమిట్ లేకుండా 10 జీబీ హై స్పీడ్ డేటాని పొందుతారు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ లో కాల్స్ చేసుకునేందుకు, ఎస్ఎంఎస్ లు పంపించుకునేందుకు అవకాశం లేదు. కేవలం ఇంటర్నెట్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ ఎన్ఎక్స్టీ, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపల్, డోకుబే, ఎపిక్ ఆన్, హాయ్ చాయ్ ఇలా మొత్తం 12 ఓటీటీ యాప్స్ వస్తాయి.

28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఈ ప్లాన్. మొత్తం 10 జీబీ డేటా ఇస్తుండగా 10 జీబీ వరకూ హై స్పీడ్ డేటా ఇస్తున్నారు. వినియోగదారులు మై జియో యాప్ లోకి వెళ్లి లేదా జియో వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్లాన్ ని ఎంచుకోవచ్చు. డేటా ప్యాక్స్ లో లేదా ఎంటర్ టైన్మెంట్ ప్లాన్స్ లో 175 రూపాయల ప్లాన్ ఉంటుంది. ఇందులోనే 30 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ, 40 జీబీ, 50 జీబీ డేటా ప్యాక్స్ ఉన్నాయి. 30 జీబీ డేటాకి 219 రూపాయలు, 40 జీబీ డేటాకి 289 రూపాయలు, 50 జీబీ డేటాపై 359 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. క్రికెట్ ఆఫర్ కింద 49 రూపాయలకే అన్ లిమిటెడ్ డేటా ఇస్తున్నారు. ఇది ఒకరోజూ మాత్రమే వస్తుంది. ఓటీటీ ప్లాన్స్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్ స్టార్ వంటి పలు ప్లాన్స్ ఉన్నాయి. 

నెట్ ఫ్లిక్స్ ప్లాన్స్:

రూ.1799 ప్లాన్:

84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నారు. మొత్తం 252 జీబీ డేటా ఇస్తున్నారు. అర్హత కలిగిన సబ్ స్క్రైబర్స్ కి అన్ లిమిటెడ్ ట్రూ 5జీ డేటా ఇస్తున్నారు. ఇందులో నెట్ ఫ్లిక్స్ (బేసిక్), జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 1799గా ఉంది. 

రూ.1299 ప్లాన్:

84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నారు. మొత్తం 168 జీబీ డేటా ఇస్తున్నారు. అర్హత కలిగిన సబ్ స్క్రైబర్స్ కి అన్ లిమిటెడ్ ట్రూ 5జీ డేటా ఇస్తున్నారు. ఇందులో నెట్ ఫ్లిక్స్ (మొబైల్), జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 1299గా ఉంది. 

ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్:

84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నారు. మొత్తం 168 జీబీ డేటా ఇస్తున్నారు. అర్హత కలిగిన సబ్ స్క్రైబర్స్ కి అన్ లిమిటెడ్ ట్రూ 5జీ డేటా ఇస్తున్నారు. ఇందులో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 1029గా ఉంది. 

డిస్నీ+హాట్ స్టార్ ప్లాన్:

84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నారు. మొత్తం 168 జీబీ డేటా ఇస్తున్నారు. అర్హత కలిగిన సబ్ స్క్రైబర్స్ కి అన్ లిమిటెడ్ ట్రూ 5జీ డేటా ఇస్తున్నారు. ఇందులో డిస్నీ+హాట్ స్టార్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది. డిస్నీ+హాట్ స్టార్ యాప్ ని 3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రూ. 949గా ఉంది. 

సోనీ లివ్, జీ5 ప్లాన్:

84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నారు. మొత్తం 168 జీబీ డేటా ఇస్తున్నారు. అర్హత కలిగిన సబ్ స్క్రైబర్స్ కి అన్ లిమిటెడ్ ట్రూ 5జీ డేటా ఇస్తున్నారు. ఇందులో సోనీ లివ్, జీ5, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 1049గా ఉంది. 

ఫ్యాన్ కోడ్ ప్లాన్:

365 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 912.5 జీబీ ప్లాన్ ఒకటి ఉంది. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా ఇస్తున్నారు. అలానే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నారు. ఫ్యాన్ కోడ్, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాప్స్ కి యాక్సెస్ ఇస్తున్నారు. ఫ్యాన్ కోడ్ యాప్ కోసం జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ ట్రూ 5జీ డేటా అందిస్తున్నారు. ఈ ప్లాన్ ధర రూ. 3,999గా ఉంది.

Show comments