Jio 1899 Recharge: 336 రోజుల వ్యాలిడిటీతో రూ.1899 జియో రీఛార్జ్ ప్లాన్! నెలకు 172 రూపాయలే!

336 రోజుల వ్యాలిడిటీతో రూ.1899 జియో రీఛార్జ్ ప్లాన్! నెలకు 172 రూపాయలే!

Your Monthly Pay Only Rs.172 With This Affordable Plan: రీఛార్జ్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రీఛార్జ్ చేయించుకుంటే ఒక బాధ. చేయించుకోకపోతే ఒక బాధ. రీఛార్జ్ చేయించకపోతే సిమ్ సర్వీస్ ఆగిపోద్దేమో అన్న టెన్షన్.. పోనీ రీఛార్జ్ చేయిద్దామంటే ధరలు భరించేలా లేవు. అయితే ఇక నుంచి అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎక్కువ ధరలు పెట్టి రీఛార్జ్ చేయించుకోలేని వారి కోసం ఒక ప్రత్యేక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ తో నెలకు కేవలం 172 రూపాయలే ఖర్చు అవుతుంది.

Your Monthly Pay Only Rs.172 With This Affordable Plan: రీఛార్జ్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రీఛార్జ్ చేయించుకుంటే ఒక బాధ. చేయించుకోకపోతే ఒక బాధ. రీఛార్జ్ చేయించకపోతే సిమ్ సర్వీస్ ఆగిపోద్దేమో అన్న టెన్షన్.. పోనీ రీఛార్జ్ చేయిద్దామంటే ధరలు భరించేలా లేవు. అయితే ఇక నుంచి అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎక్కువ ధరలు పెట్టి రీఛార్జ్ చేయించుకోలేని వారి కోసం ఒక ప్రత్యేక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ తో నెలకు కేవలం 172 రూపాయలే ఖర్చు అవుతుంది.

ఇటీవల జియో టారిఫ్ ధరలను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు కూడా రీఛార్జ్ ధరలను పెంచేశాయి. దీంతో జియోలో ఉన్నా, జియో నుంచి బయటకు వెళ్లినా పెద్ద తేడా ఏం లేదని చాలా మంది వినియోగదారులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఈ ప్లాన్ గురించి తెలిస్తే నిజంగా ఎగిరి గెంతులేస్తారు, ఎందుకంటే నెలకు కనీసం 249 రూపాయలు పెడితేనే గానీ అపరిమిత కాల్స్, ఇంటర్నెట్ తో రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో లేదు. అయితే ఈ ప్లాన్ తో మీకు నెలకు కేవలం 172 రూపాయలే పడుతుంది. చాలా మంది పెద్దగా ఫోన్ వాడరు. ఇంటర్నెట్ కూడా వాడరు. అవసరం ఉన్నప్పుడు టాపప్ చేయించుకుంటారు.

దీని వల్ల అత్యవసరం సమయంలో కాల్స్ చేసుకునే వీలు ఉండదు. పోనీ కనీస రీఛార్జ్ ప్లాన్ వేయిద్దామన్నా గానీ వీళ్ళకి ఇంటర్నెట్ తో పెద్దగా పని ఉండదు. దీని వల్ల డేటా అనేది వృధా అవుతుంది. డేటా వృధా అయినప్పుడు అనవసరంగా 249 రూపాయలు చెల్లించడం భారమే కదా. అందుకే మీ కోసమే నెలకు 172 రూపాయల ఖర్చుతో 1899 రూపాయల ప్లాన్ అందుబాటులో ఉంది. 1899 రూపాయల రీఛార్జ్ తో మీకు 336 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. దాదాపు 11 నెలల పాటు ఉంటుంది. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 3600 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. అదనంగా 24 జీబీ డేటా వస్తుంది. 24 జీబీ అంటే నెలకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా. ఇది పెద్దగా డేటా వినియోగించని వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా షాపింగ్ చేసే సమయంలో ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడుకునేవారు డేటా ఆన్ చేసుకుని చెల్లింపులు చేయవచ్చు.

అపరిమిత కాల్స్, 3600 మెసేజులు వస్తున్నాయి. ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడం.. అదనపు భారం కంటే ఇది చాలా ఉత్తమం. దీని వల్ల మీరు 11 నెలలకి 850 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ 1899 రూపాయల ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ కి యాక్సెస్ పొందవచ్చు. కొంతమంది ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటుంది. అలాంటి వారికి సెల్ ఫోన్ లో పెద్దగా ఇంటర్నెట్ అవసరం లేదు. ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు డిజిటల్ పేమెంట్స్ చేయడానికి ఎలాగు 24 జీబీ డేటా ఇస్తున్నారు కాబట్టి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక కాల్స్ మాట్లాడుకోవడానికి అన్ లిమిటెడ్ కాల్స్ సదుపాయం ఉండనే ఉంది. ఎస్ఎంఎస్ లు కూడా 3600 ఉన్నాయి. తక్కువ డేటా వాడుతూ.. ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడుకునే పేదలకు, సామాన్యులకు ఇది ఈ 1899 రూపాయల ప్లాన్ బెస్ట్. నెలకు 172 రూపాయలే పడుతుంది.

Show comments