P Venkatesh
ivoomi jeetx ze EV: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ ధరలోనే మరో కొత్త ఈమీ మార్కెట్ లోకి వచ్చింది. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 170కి.మీల వరకు ప్రయాణించొచ్చు.
ivoomi jeetx ze EV: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ ధరలోనే మరో కొత్త ఈమీ మార్కెట్ లోకి వచ్చింది. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 170కి.మీల వరకు ప్రయాణించొచ్చు.
P Venkatesh
వరల్డ్ వైడ్ గా విద్యుత్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభ్యమవ్వడం.. డ్రైవ్ చేసేందుకు కూడా ఈజీగా ఉండడంతో ఈవీల కొనుగోలుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఈవీలు జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈవీ ప్రియుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. ఐవూమీ ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త జీత్ ఎక్స్ జడ్‌ఈ స్కూటర్ ను 3కేడబ్య్లూహెచ్ ఆప్షన్ లో లాంఛ్ చేసింది.
ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు, పెట్రోల్ ఖర్చులు అధికమవుతున్న తరుణంలో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. చాలా తక్కువ ఖర్చుతోనే 100కి.మీలకుపైగానే ప్రయాణించే వీలుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఐవూమీ రిలీజ్ చేసిన జీత్ ఎక్స్ జడ్‌ఈ సింగిల్ ఛార్జ్ తో 170 కి.మీ దూరం వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. దీని ప్రారంభ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. కళ్లు చెదిరే డిజైన్, సూపర్ ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకర్షిస్తోంది. ఈ ఈవీకి మార్కెట్ లో మంచి స్పందన లభిస్తోంది.
ఈ స్కూటర్‌ని మొబైల్ యాప్ కనెక్టివిటీతో స్మార్ట్ స్పీడోమీటర్, టర్న్ బై టర్న్ రూట్ సమాచారాన్ని అందించే నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో నావిగేట్ చేయవచ్చు. వీటితో పాటు స్కూటర్ స్క్రీన్‌లో కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను పొందవచ్చు, ట్రావెల్ డేటా, ఎస్ఓసీ అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నాయి. ఇది గంటకు 63 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎక్, రైడర్, స్పీడ్ మోడ్స్‌ని అందించారు. ఎకో మోడ్‌లో 170 కి.మీలు, రైడర్ మోడ్‌లో 140 కి.మీలు, స్పీడ్ మోడ్‌లో 130 కి.మీల రేంజ్ ను కలిగి ఉంది.