ఆ కంపెనీలో ఏకంగా 350 మందికి రూ.కోటికి పైగా జీతం.. ఎక్కడంటే!

ఓ కంపెనీలో కోటీశ్వరుల సంఖ్య ఏటా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇప్పుడు మీకు చెప్పబోయే కంపెనీలో ఏకంగా 350 మందికి కోటి పైనే జీతం. ఇంతకు ఆ కంపెనీ ఏందంటే..

ఓ కంపెనీలో కోటీశ్వరుల సంఖ్య ఏటా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇప్పుడు మీకు చెప్పబోయే కంపెనీలో ఏకంగా 350 మందికి కోటి పైనే జీతం. ఇంతకు ఆ కంపెనీ ఏందంటే..

సాధారణంగా కంపెనీల్లో ఉద్యోగులు జీతాలు వారి క్వాలిఫికేషన్‌, గత అనుభవం, కెరీర్‌లో సాధించిన విజయాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక కొన్ని కంపెనీల్లో అయితే ఇలాంటివి ఏం ఉండవు. ఉద్యోగులను తరగతుల వారీగా విభజించి.. వారికి వేతనాలు నిర్ణయిస్తారు. ఇక ఇక కంపెనీల్లో అత్యధిక వేతనాలు అందుకునే వారు కొద్ది మందే ఉంటారు. కంపెనీని బట్టి వీరి వేతనం ఉంటుంది. కొన్ని కంపెనీల్లో అత్యధిక జీతం లక్షల్లో ఉంటే.. మరి కొన్ని కంపెనీల్లో కోట్లలో ఉంటుంది. అయితే ఇంత భారీ మొత్తం వేతనం అందుకునే వారి సంఖ్య మాత్రం పదుల్లోనే ఉంటుంది. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కంపెనీలో.. 10, 20 కాదు ఏకంగా 350 మందికి కోటి రూపాయలకు పైగా వార్షిక వేతనం చెల్లిస్తున్నారు. మరి ఇంతకు ఆ కంపెనీ ఏదంటే..

దేశంలో పురాతన సంస్థగా పేరు పొందిన ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్‌ అదే ఐటీసీలో సుమారు 350 మంది ఉద్యోగులకు ఏడాదికి కోటి రూపాయలకు పైగా వేతనం చెల్లిస్తున్నారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఐటీసీలో ప్రతి ఏటా వార్షిక వేతనం కోటి అందుకునే వారి సంఖ్య పెరుగుతోంది తప్ప దిగి రావడం లేదు. గతంలో ఐటీసీలో కోటికి పైగా వార్షిక వేతనం అందుకునే ఉద్యోగుల సంఖ్య 282గా ఉండగా.. ఈ ఏడాదికి అది 350కి చేరింది. అంటే 68 మంది ఉద్యోగులు కొత్తగా కోటీశ్వరులయ్యారు.

ఐటీసీ తాజాగా విడుదల చేసిన 2023-24 వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. గతంలో ఐటీసీలో వార్షిక వేతనం కోటి రూపాయలకు పైగా అందుకునే ఉద్యోగుల సంఖ్య 282 ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 68 మంది ఉద్యోగుల వార్షిక వేతనం కోటికి పైగా చేరడంతో.. మొత్తం సంఖ్య 350కి చేరింది. ఒక్క కంపెనీలోనే ఇంత మంది ఉద్యోగులకు వార్షిక వేతనంగా కోటి రూపాయలకు పైగా అందించడం అసాధరణమైన అంశం అంటున్నారు.

కంపెనీ ప్రకటించిన లెక్కల ప్రకారం వార్షిక వేతనంగా కోటి రూపాయలకు పైగా తీసుకుంటున్న వారి నెల జీతం 9 లక్షల రూపాయలుగా ఉంది. ఇక ఐటీసీలో అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో ఆ కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ పూరి ముందు వరుసలో ఉన్నారు. ఆయన వార్షిక వేతనరూ.28.62 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇది గతంలో కంటే 50 శాతం పెరిగింది. కీలక నిర్వహణ సిబ్బంది (కేఎంపీ) వేతనం 59 శాతం పెరిగినట్లు కంపెనీ చెప్పింది. కేఎంపీ మినహా ఉద్యోగుల సగటు వేతనం 9 శాతం పెరిగినట్లు చెప్పింది. మార్చి 31, 2024 నాటికి ఐటీసీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 24,567కు చేరింది. సిగరెట్లు, ఎఫ్‌ఎంసీజీ, హోటళ్లు, అగ్రి బిజినెస్, పేపర్‌బోర్డ్‌లు, పేపర్ అండ్‌ ప్యాకేజింగ్ వంటి అనేక రకాల వ్యాపారాలను కలిగి ఉన్న ఐటీసీ 2023-24లో రూ.76,840.49 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది.

Show comments