Dharani
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అందుకు కారణం ఏంటి.. ఎవరు ఈ ఫిర్యాదు చేశారు వంటి వివరాలు మీ కోసం..
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అందుకు కారణం ఏంటి.. ఎవరు ఈ ఫిర్యాదు చేశారు వంటి వివరాలు మీ కోసం..
Dharani
గత కొంత కాలం నుంచి ఐటీ రంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. టాప్ ఎంఎన్‌సీలు సహా.. చిన్న చిన్న కంపెనీలు చాలా వరకు ఉద్యోగులను తొలగిస్తూ వచ్చాయి. దాంతో ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితులు వచ్చాయి. ఇలా ఉండగా.. తాజాగా దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. ఇంతకు ఇన్ఫోసిస్ మీద కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి.. ఎవరు ఫిర్యాదు చేశారు.. అసలేం జరిగింది అంటే..
సాధారణంగా ఐటీ ఉద్యోగం ఇష్టపడే వారు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ కోసం కలలు కంటారు చాలా మంది. అందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. ఇక ఒక్కసారి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చిందంటే చాలు.. ఇక తమ జీవితం సెటిల్ అయినట్లే అని భావిస్తారు. అది కూడా ఫైనల్ ఇయర్‌లో ఉండగానే.. క్యాంపెస్ ప్లేస్‌మెంట్‌లో ఇన్ఫోసిస్‌లో జాబ్ కొడితే.. చాలా గ్రేట్‌గా భావిస్తారు. ఆ కంపెనీలో ఉద్యోగం అంటే అంత క్రేజ్. అయితే తాజాగా ఇన్ఫోసిస్ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
కారణం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలక్ట్ చేసుకున్న వారిని ఉద్యోగంలోకి చేర్చుకోవడంలో ఇన్ఫోసిస్ ఆలస్యం చేస్తోందంట. ఈ మేరకు ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(ఎన్‌ఐటీఈఎస్).. దీనిపై కార్మిక, ఉద్యోగకల్పన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2 వేల మందిని కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపిక చేసుకుని.. వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని నైట్స్ ఆరోపించింది. ఈ అంశంపై దర్యప్తు చేపట్టాలని ఫిర్యాదు చేసింది.
ఇన్ఫోసిస్‌లో జాబ్‌కు సెలక్ట్ అయిన ఈ 2 వేల మంది ఇప్పటి వరకు ప్రారంభంలో సంతోషంగా ఉన్నారని.. కానీ ఇన్ఫోసిస్ నిర్లక్ష్య ధోరణి కారణంగా వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని నైట్స్ ఆందోళణ వ్యక్తం చేసింది. ఈ రెండు వేల మందిని.. సుమారు రెండేళ్ల నుంచి ఉద్యోగంలో చేర్చుకోలేదని.. దాంతో వారిలో మానసిక స్థైర్యం సన్నగిల్లుతుందని.. భవిష్యత్తు పట్ల భయ పడుతున్నారని నైట్స్ చెప్పుకొచ్చింది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లు అందుకున్న చాలా మంది ఈ సంస్థపై ఉన్న విశ్వాసంతో ఇతర కంపెనీల నుంచి వచ్చిన ఉద్యోగావకాశాలను వదులుకున్నారు. కానీ ఇన్ఫోసిస్ మాత్రం.. వీరిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. దాంతో వారు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనుక ఇప్పటికైనా ఇన్ఫోసిస్ ఇప్పటికైనా దీనిపై దృష్టి సారిస్తే.. వీరంతా జీవితాలకు మంచిది’’ అని నైట్స్ చెప్పుకొచ్చింది.