P Venkatesh
Standard deduction: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్తను అందించేందుకు రెడీ అవుతోంది. బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనున్నది.
Standard deduction: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్తను అందించేందుకు రెడీ అవుతోంది. బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనున్నది.
P Venkatesh
ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టిన ఎన్డీఏ పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈసారి బడ్జెట్ లో అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్తను అందించేందుకు సిద్ధమవుతున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీతం పొందుతున్న మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 70 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.
రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు ఇలా ఏది చూసుకున్న కూడా తడిసి మోపడవుతోంది. జీతం పొందే మధ్య తరగతి ఉద్యోగులకు ఇది మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే పన్ను మినహాయింపులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే వ్యక్తులకు అందుబాటులో ఉండే ఫ్లాట్ డిడక్షన్. ఈ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ఉద్యోగులు ఎటువంటి రుజువు లేదా పత్రాలను యజమాని లేదా ఐటీ విభాగానికి సమర్పించాల్సిన అవసరం లేదు.
2018లో జీతం పొందే వ్యక్తులకు సంవత్సరానికి స్టాండర్డ్ డిడక్షన్ రూ. 40,000గా ఉండేది. 2019 మధ్యంతర బడ్జెట్‌లో, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 50,000కి పెంచబడింది. 2023 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా ఉంచింది కేంద్రం. దీంతో టాక్స్ పేయర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకపోయినా రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రస్తుతం కొత్త పన్ను విధానం ప్రకారం.. రూ. 7 లక్షల వరకు ఆదాయం వచ్చే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుతో రూ. 7.70 లక్షల వరకు పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచితే లక్షలాది మంది ఉద్యోగులకు లాభం చేకూరనున్నది. మరి కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ఎంతమేరకు పెంచుతుందో తెలియాలంటే బడ్జెట్ వరకు వెయిట్ చేయాల్సిందే.