Gold Rates: గోల్డ్ కొనేందుకు ఇప్పుడు తగిన సమయమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..

గోల్డ్ కొనేందుకు ఇప్పుడు తగిన సమయమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..

Is It Right Time To Buy Gold: బంగారం కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే రేట్లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అనేది చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అయితే బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. మరి బంగారం ధరలు తగ్గుతాయా? కొనేందుకు తగిన సమయం ఎప్పుడు?

Is It Right Time To Buy Gold: బంగారం కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే రేట్లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అనేది చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అయితే బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. మరి బంగారం ధరలు తగ్గుతాయా? కొనేందుకు తగిన సమయం ఎప్పుడు?

బంగారం అనేది ఒక ఎమోషన్. అయితే బంగారం ఎప్పుడు కొనాలి? కొనేందుకు ఇది తగిన సమయమేనా? కదా? అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకంటే బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో? ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేం. కొన్న తర్వాత తగ్గితే అంతకు మించిన అసంతృప్తి మరొకటి ఉండదు. ఒకవేళ పెరిగితే హ్యాపీసు. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ని ప్రకటించిన రోజున బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో మంచి రోజులొచ్చాయి.. గోల్డ్ రేట్లు ఇంకా తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72 వేలు పైనే ఉంది. బంగారంపై పెట్టుబడి పెట్టడాన్ని చాలా మంది ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుంటారు. అందుకే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు బంగారం కొంటున్నారు. దీంతో డిమాండ్ అనేది పెరిగిపోతుంది.

ఆగస్టు 9 నుంచి 13 వరకూ 10 గ్రాముల బంగారం ధరలు గరిష్టంగా రూ. 2,350 పెరిగింది. ఆగస్టు 14న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ గోల్డ్ రేట్లు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ ఇండెక్స్ లో మృదుత్వం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరగడం, మన దేశంలో పసిడికి పెరుగుతున్న డిమాండ్ వంటివి బంగారం ధరలు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గంటల వ్యవధిలో పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వారంలో రెండు రోజులు స్వల్పంగా తగ్గుతున్న బంగారం ధరలు.. మిగిలిన రోజులు పెరిగిపోతున్నాయని అంటున్నారు. కాబట్టి బంగారం కొనాలనుకునేవారు తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

ఇక బంగారం ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ. 6,670గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 66,700గా ఉంది. ఇక ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,277గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,700గా ఉంది. ఇక 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,457గా ఉంది. 10 గ్రాముల వద్ద 18 క్యారెట్ల బంగారం ధర రూ. 54,570గా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2,495.64 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం అయితే నెగిటివ్ లో వైపు ట్రెండ్ అవుతుంది. ఔన్సు స్పాట్ వెండి ధర 28.96 డాలర్లుగా ఉంది. దేశంలో వెండి ధరల విషయానికొస్తే.. గ్రాము వెండి ధర రూ. 91 రూపాయలుగా ఉంది. కిలో వెండి రూ. 91 వేలుగా ఉంది. గత కొన్ని రోజులుగా వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెగిటివ్ వైపు ట్రెండ్ అవుతున్న నేపత్యంలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Show comments