Dharani
Dharani
సాధారణంగా కిరాణా దుకాణాలు, మాల్స్‌తో పోల్చితే.. థియేటర్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో అమ్మే ఆహార పదార్థాలు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, ఆఖరికి వాటర్ బాటిల్ ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక గత కొంత కాలంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాలను ఎంత భారీ ధరకు విక్రయిస్తున్నారో.. తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తుండటంతో.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపై చర్చ సాగుతోంది. రైళ్లలో, విమానాశ్రయాల్లో ఇలా అధిక ధరలు వసూలు చేయడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఐఆర్‌సీటీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణించే వారికి భారీ గుడ్ న్యూస్ చెప్పింది. మరీ ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు.
నివేదికల ప్రకారం జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారి కోసం రైల్వే డిపార్ట్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనరల్ కోచ్ ప్రయాణికుల కోసం తక్కువ ధరకే.. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రైల్వే బోర్డు ఇప్పటికే డివిజన్‌ల యూనిట్ల కోసం రైల్వేస్ జనతా ఖానాను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ సేవలు కేవలం నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. త్వరలోనే ఈ సర్వీస్‌ను మరింత విస్తరించే దిశగా రైల్వేశాఖ ప్రణాళికలు చేపడుతుంది.
రైల్వేస్ జనతా ఖానా మెన్యూలో భాగంగా రెండు కెటగిరీల్లో ఆహారాన్ని అందిస్తారు. మొదటిది 20రూపాయలకే అందించే భోజనం. దీనిలో 7 పూరీలు(175 గ్రాములు), పొటాటే వెజిటేబుల్స్ (150 గ్రాములు) ఊరగాయ (12 గ్రాములు) అందిస్తారు. ఇక 50 రూపాయల కాంబోలో 350 గ్రాముల రాజ్మా లేదా రైస్, పావ్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైన పదార్థాలుంటాయి. అంతేకాక 200 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్‌ను కేవలం రూ.3లకే అందిస్తారు. ఈ కొత్త విధానం సక్సెస్ అయితే ప్రయాణికులకు చాలా మేలు కలుగుతుందని.. దీని ద్వారా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి కేవలం 20 రూపాయలకే మంచి నాణ్యమైన భోజనం అందించే అవకాశం లభిస్తుంది అంటున్నారు.