P Venkatesh
మీరు ఇల్లు లేదా స్థలంపై పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? ఈ రెండింటిలో దేనిపై ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభమో తెలియక తికమక పడుతున్నారా? స్థలం లేదా ఇల్లు కొనడంలో ఏది బెటర్ అంటే?
మీరు ఇల్లు లేదా స్థలంపై పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? ఈ రెండింటిలో దేనిపై ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభమో తెలియక తికమక పడుతున్నారా? స్థలం లేదా ఇల్లు కొనడంలో ఏది బెటర్ అంటే?
P Venkatesh
మీ వద్ద ఉన్న డబ్బును మంచి రాబడి వచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, బ్యాంక్స్, ప్రభుత్వ పథకాలల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలను అందుకుంటున్నారు. వీటన్నింటికంటే కూడా ఎక్కువ రాబడులు వచ్చేది మాత్రం రియల్ ఎస్టేట్ లోనే అని చెబుతున్నారు నిపుణులు. మీరు స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టలనుకుంటే.. స్థలం కొంటే లాభమా? లేదా ఇల్లు కొనుక్కోవడం లాభమా అనే ఆలోచనతో సతమతమవుతుంటారు. కొందరికి స్థలంపై పెట్టుబడి లాభాలను తెచ్చిపెడుతుందనిపిస్తే.. మరికొందరికి మాత్రం ఇల్లు కొంటేనే లాభదాయకంగా ఉంటుందని భావిస్తుంటారు. మరి స్థలం లేదా ఇల్లు ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్ అంటే..
హైదరాబాద్ వంటి నగరంలో స్థలాల ధరలు, ఇల్ల ధరలు భారీగానే పలుకుతున్నాయి. నగరంలో మౌళిక సదుపాయాలు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఇక్కడ ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐటీ, మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతుండడంతో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. విద్యా, ఉద్యోగాల కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాలా మంది ఇక్కడే సెటిల్ అవడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో వారు ఇక్కడ స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలని భావిస్తుంటారు.
అయితే చాలా మంది స్థలం కంటే ఇల్లే బెటర్ అంటున్నారు. ఎందుకంటే.. స్థలం కొన్నట్లైతే మళ్లీ అందులో ఇల్లు నిర్మించుకోవాలి. దీంతో పెట్టుబడి ఎక్కువై ఆర్థిక భారం అవుతుంది. అదే ఇల్లు కొనుక్కుంటే.. అద్దె రూపంలో ఆదాయం వస్తుంటుంది. అంటే ఇంటిపై పెట్టిన పెట్టుబడిలో కొంత మొత్తం తిరిగి వస్తున్నట్లే కదా. డిమాండ్ పెరిగినప్పుడు మీరు ఇల్లును అమ్ముకోవాలనుకుంటే రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కన్నా హైదరాబాద్ లోనే స్థలాలు, ఇళ్లు, అపార్ట్ మెంట్ ధరలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంతో హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
నగరంలోనే గాక శివారు ప్రాంతాల్లో కూడా అభివృద్ది జరుగుతుండడంతో సంగారెడ్డి, మేడ్చల్, శంకర్ పల్లి , పటాన్ చెరు వంటి ప్రాంతాల్లో ఇల్లు, అపార్ట్ మెంట్స్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఉదాహరణకు మీరు మియాపూర్ లో 1200 చదరపు అడుగుల స్థలాన్ని తీసుకుందామనుకుంటే.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్క్వేర్ ఫీట్ ధర రూ. 7,050 పలుకుతోంది. అంటే 1200 స్వ్కేర్ ఫీట్ స్థలానికి రూ. 84,60,000 అవుతుంది. ఒక వేళ ఇదే ఏరియాలో 2బీహెచ్ కె ఇల్లును కొనుగోలు చేయాలనుకుంటే రూ. 65 లక్షల నుంచి 95 లక్షల్లో లభ్యమవుతున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లైతే స్థలంపై పెట్టుబడి కంటే ఇల్లు కొనుక్కోవడమే బెటర్ అంటున్నారు మార్కెట్ నిపుణులు.