త్వరలోనే వందే భారత్‌ మెట్రో.. గంటల వ్యవధిలోనే 124 నగరాలు చుట్టేయొచ్చు

త్వరలోనే వందే భారత్‌ మెట్రో.. గంటల వ్యవధిలోనే 124 నగరాలు చుట్టేయొచ్చు

Vande Bharat Metro Train: ఇప్పటికే దేశంలో వందే భారత్ రైళ్లకు ఎంతటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రయాణికులకు రైల్వే శాక మరో అదిరే శుభవార్త అందింది. త్వరలోనే దేశంలో 124 నగరాలను కలుపుకొని వందేభారత్ మెట్రో రైలు పట్టాలెక్కనుంది.

Vande Bharat Metro Train: ఇప్పటికే దేశంలో వందే భారత్ రైళ్లకు ఎంతటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రయాణికులకు రైల్వే శాక మరో అదిరే శుభవార్త అందింది. త్వరలోనే దేశంలో 124 నగరాలను కలుపుకొని వందేభారత్ మెట్రో రైలు పట్టాలెక్కనుంది.

దేశంలో రైల్వే వ్యవస్థను మెరుగు పరిచేందుకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్లు అందుబాటులోకి వచ్చిన నుంచి ప్రజలకు ప్రయాణం మరింత సులభంగా మారింది. అంతేకాకుండా.. అత్యంత టెక్నాలజీతో రూపొందించిన ఈ వందే భారత్ రైలు ప్రయాణం చాలా ప్రయోజకరంగా ఉంది. ముఖ్యంగా హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్న ఈ ట్రైన్ లో అతి తక్కువ సమయంలోనే ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఈ వందేభారత్ రైలు ప్రయాణం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో ఈ వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రయాణికులకు రైల్వే శాక మరో అదిరే శుభవార్త అందింది. త్వరలోనే దేశంలో 124 నగరాలను కలుపుకొని వందేభారత్ మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే దేశంలో వందే భారత్ రైళ్లకు ఎంతటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే దేశంలో ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లిపర్ రైలు కూడా అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే దేశంలో మొదటిసారి వందే భారత్ మెట్రో రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కొత్తగా సన్నద్ధలు చేస్తోంది. కాగా, ఇప్పటికే ఈ వందేభారత్ మెట్రో రైలు ట్రయల్ రన్ లు జరుగుతున్నాయి. కాగా, త్వరలోనే ఈ ట్రయల్ రన్ లు ముగిస్తాయని, ఆ తర్వాత ఈ రైల్లు పట్టాలపై పరుగులు పెట్టాననున్నయని సమాచారం. ఇకపోతే భారతీయ రైల్వే ఈ సరి కొత్త మెట్రో రైల్ల నెట్ వర్క్ ను గణనీయంగా విస్తరణ చేసింది. ముఖ్యంగా ఈ కొత్త మెట్రో సర్వీసులు దాదాపు 124 నగరాలను కలపుకొని ప్రారంభిస్తున్నట్లు సమాచారం.

అందులో  ఆగ్రా-ఢిల్లీ, తిరుపతి-చెన్నై, ఢిల్లీ-మొరాదాబాద్, భువనేశ్వర్-బాలాసోర్, ఢిల్లీ-రేవారి, ఆగ్రా-మధుర, లక్నో-కాన్పూర్ నగర మార్గాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విస్తృతమైన నెట్‌వర్క్ ప్రధాన ప్రాంతాలలో కనెక్టివిటీని మరీంత మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ భావిస్తున్నారు. ఇకపోతే త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ వందేభారత్ మెట్రో రైలు టికెట్ ధర కోసం ఇప్పటి నుంచే ప్రయాణికులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ మెట్రో ట్రైన్ నిర్దిష్ట ఛార్జీల సమాచారం మాత్రం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. కాకాపోతే వందే భారత్ మెట్రో కోసం ఖర్చు ఏసీ చైర్ కార్ సేవల కంటే తక్కువగా ఉంటుందని అంతర్గత వర్గాల ద్వారా సమాచారం. పైగా నగరాల వారీగా టిక్కెట్ ధరలు మారవచ్చని  అంచనా వేస్తున్నారు.

ఇకపోతే వందే భారత్ మెట్రో త్వరగా వేగవంతం అయ్యేలా రూపొందించబడింది. కేవలం 45 నుండి 47 సెకన్లలో 100 కిమీ/గం చేరుకుంటుంది. ఇది ఎక్స్‌ప్రెస్ 52 సెకన్ల కంటే వేగంగా ఉంటుంది. అయితే, ఇది గరిష్టంగా 130 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం 180 కిమీ/గం కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెట్రో దగ్గరగా ఉన్న స్టేషన్లలో ఆగుతుంది కాబట్టి అంత వేగంగా వెళ్లాల్సిన అవసరం లేదు. మరీ, త్వరలోనే దేశవ్యాప్తంగా వందేభారత్ మెట్రో రైల్లు ప్రారంభం కావడంపై మీ అభిప్రాయాలను కామెంటస్ రూపంలో తెలియజేయండి.

Show comments