రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే సౌకర్యం కల్పించనున్న ఇండియన్ రైల్వేస్!

Indian Railways: రైలులో ప్రయాణించే ప్రయాణీకులు సరైన సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడుతుంటారు. వారి కోసం ఇండియన్ రైల్వేస్ సౌకర్యాలని కల్పిస్తుంది.

Indian Railways: రైలులో ప్రయాణించే ప్రయాణీకులు సరైన సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడుతుంటారు. వారి కోసం ఇండియన్ రైల్వేస్ సౌకర్యాలని కల్పిస్తుంది.

భారతదేశంలో రైలులో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు రైలు ప్రయాణీకులకు రైళ్లల్లో సరైన సదుపాయాలు ఉండేవి కావు. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు అయితే సరైన సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడేవారు. బోగీలు శుభ్రంగా ఉండేవి కావు. ఇక జనరల్ కంపార్ట్మెంట్ అయితే మహా దారుణంగా ఉంటుంది. ఇప్పటికి కూడా జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్లాలంటే ప్రయాణీకులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రయాణీకులు ఇబ్బందులు పడే కొన్ని వైరల్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే గత కొంతకాలం నుంచి కూడా రైళ్లలో మెరుగైన సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ తన సేవలను మెరుగుపరుస్తుంది. ప్రయాణీకుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది.

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైళ్లలో తెల్లటి షీట్లు, పాత దుప్పట్ల స్థానంలో శుభ్రంగా ఉండే అల్ట్రాసాఫ్ట్ లినెన్ దుప్పట్లు అందించనున్నట్లు ఇటీవల ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రైల్వే ప్రయాణీకుల ప్రయాణాన్నిమెరుగుపరిచడానికి, ప్రయాణికుల కోసం కొత్త ప్రీమియం అల్ట్రా సాఫ్ట్ లినెన్‌ను ఏర్పాటు చేశారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)తో కలిసి ఇండియన్ రైల్వేస్ ఈ లినెన్ ను ఏర్పాటు చేసింది. రైలులో పరిశుభ్రత, బెడ్‌రోల్స్, ఆహారం, టాయిలెట్‌లో నీరు, హ్యాండ్‌వాష్, బోగీలోని సీట్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చోవడం వంటి సమస్యలు తరచుగా ఉంటాయి. దాంతో ప్రయాణీకులు తప్పకుండా ఇబ్బందులు పడతారు.

రైలులో ఉన్న సమస్యలను పర్యవేక్షించడానికి ఇండియన్ రైల్వేస్ ఏఐ సహాయం తీసుకోనుందని సమాచారం తెలిసింది. రైలులో ఈ ఫెసిలిటీ కావాలంటే 15 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు టైం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సదుపాయం సిస్టమ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT), AI సాధనాల ద్వారా పని చేస్తుంది. నిజానికి రైలులో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యాల కోసం ఒక SOP ఉంది. రైల్వేలు దీనికి కూడా డబ్బులు వసూలు చేస్తాయి. కానీ ఈ సేవలను పూర్తిగా ప్రయాణీకులకు సౌకర్యాలుగా మార్చడానికి తగిన ఏర్పాట్లు లేవు. అందుకే ఇప్పుడు రైల్వే AI సాయంతో రైలులోని ప్రతి బోగీలో SOPని పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా SOP 90 శాతం కంటే తక్కువ పూర్తయినప్పుడు రైలు మేనేజర్‌కు వెంటనే హెచ్చరిక వెళుతుంది. ఈ AI టెక్నాలజీ ద్వారా SOP ప్రమాణాల ప్రకారం ఎక్కడ ఏమి అవసరమో కూడా తెలుస్తుంది. దీని వలన ప్రయాణికుల సౌకర్యాలను ఇంకా మెరుగుపరచవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ విధంగా ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు తగిన సౌకర్యాలని కల్పిస్తుంది.

 

Show comments