మీ క్రెడిట్ కార్డుపై స్నేహితులకి వస్తువులు తీసిస్తున్నారా? మీ ఇంటికి IT నోటీసులు వస్తాయి జాగ్రత్త!

Credit Card: మీ క్రెడిట్‌ కార్డును స్నేహితులు, బంధువులకు ఇస్తున్నారా.. దాని మీద వేరే వారికి వస్తువులు కొనుగోలు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే..

Credit Card: మీ క్రెడిట్‌ కార్డును స్నేహితులు, బంధువులకు ఇస్తున్నారా.. దాని మీద వేరే వారికి వస్తువులు కొనుగోలు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే..

నేటి కాలంలో క్రెడిట్‌ కార్డు వినియోగం తప్పనిసరి అయ్యింది. చేతిలో రూపాయి లేకపోయినా సరే.. క్రెడిట్‌ కార్డు ఉంటే.. ధైర్యంగా ఉండవచ్చు. అత్యవసర వేళ కార్డును ఉపయోగించి డబ్బు వాడుకుని.. ఆ తర్వాత సకాలంలో చెల్లిస్తే సరి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే భారీగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇక నేటి కాలంలో ఒక్కరి దగ్గర క్రెడిట్‌ కార్డు ఉంటే.. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా చాలా మంది దాన్ని వాడుతుంటారు. డబ్బులు వాళ్లే కడతారు కదా అనే ఉద్దేశంతో అడిగిన వారికల్లా క్రెడిట్‌ కార్డ్‌ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. మీ క్రెడిట్‌ కార్డును ఇతరుల కోసం వినియోగిస్తే.. మీ ఇంటికి ఐటీ నోటీసులు రావడమే కాక.. లక్షల్లో ఫైన్‌ పడే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. ఎలానో తెలియాలంటే ఇది చదవండి.

ఫ్రెండ్స్‌, బంధువులు అడిగారని.. మన క్రెడిట్‌ కార్డు వారికి ఇవ్వడం.. దాని మీద వస్తువులు కొనిపించడం వంటివి చేస్తుంటాం. సకాలంలో డబ్బు చెల్లిస్తే చాలని అనుకుంటాం. చాలా మంది ఇలా ఫ్రెండ్స్‌ కార్డ్‌ తీసుకుని.. వాడుకుని.. డబ్బులు చెల్లిస్తారు. సరే ఇది మంచి పద్దతే కానీ.. ఈ అలవాటు మితిమీరితే మీకే ప్రమాదం అని ఐటీ నోటీసులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా టాక్స్‌ పేయర్స్‌.. క్రెడిట్‌ కార్డ్‌ వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఎలా అంటే.. మీ సంవత్సర ఆదాయం ఆరు లక్షల రూపాయలు అనుకుందాం. అప్పుడు మీరు టాక్స్‌ కట్టాల్సి వస్తుంది. ఐటీ ఫైల్‌ చేసే సమయంలో మీ వార్షికాదాయం 6 లక్షలు అని మెన్షన్‌ చేస్తారు. ఆ మేరకు డబ్బులు కడతారు. అయిపోయింది.

అయితే మీకు క్రెడిట్‌ కార్డ్‌ వాడే అలవాటు ఉండటం వల్ల మీ ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది అనుకుందాం. అంటే మీరే కాక స్నేహితులు, బంధువులకు క్రెడిట్‌ కార్డ్‌ ఇచ్చి.. వారు వాడుకుని.. తిరిగి చెల్లించి.. ఇలా మొత్తం మీద మీరు ఏడాదికి క్రెడిట్‌ కార్డ్‌ మీద 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారు అనుకుందాం. కానీ మీరు ఐటీ ఫైల్‌ చేసే సమయంలో.. మీ వార్షికాదాయం కేవలం ఆరు లక్షల రూపాయలు అని చూపించారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు కట్టిన క్రెడిట్‌ కార్డు బిల్లు 10 లక్షల రూపాయలు. అప్పుడు ఐటీ అధికారులు మీ ఆదాయం కన్నా ఎక్కువగా ఉన్న ఎక్స్‌ట్రా యూసేజ్‌ గురించి ఆరా తీస్తారు.

పైగా మీ స్నేహితులు క్రెడిట్‌ కార్డు వాడుకుని ఆ డబ్బులను తిరిగి మీ బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు. అప్పుడు ఐటీ అధికారులు దీన్ని అదనపు ఆదాయంగా భావించి.. దీని గురించి స్పష్టత ఇవ్వమని మీకు ఐటీ నోటీసులు పంపుతుంది. మీరు కనుక క్రెడిట్‌ కార్డు వాడకం గురించి ఐటీ అధికారులకు క్లియర్‌గా చెప్పకపోతే.. అప్పుడు వారు ఈ ఎక్స్‌ట్రా ఆదాయం మీద జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.. అది కూడా 800 శాతం. అంటే లక్షల్లో కట్టాల్సి వస్తుంది. అందుకే ఐటీ ఫైల్‌ చేసేవారు క్రెడిట్‌ కార్డు వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

Show comments