Edible Oil: 1.6 శాతం తగ్గిన వంటనూనె దిగుమతులు.. ధరలు పెరుగుతాయా?

Chance Of Hike In Edible Oil Prices: నిత్యావసర సరుకుల కొరత ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరగడం అనేది కామన్. అయితే ఇప్పుడు వంటనూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. డిమాండ్ కి తగ్గా లభ్యత లేకపోవడం వల్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.

Chance Of Hike In Edible Oil Prices: నిత్యావసర సరుకుల కొరత ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరగడం అనేది కామన్. అయితే ఇప్పుడు వంటనూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. డిమాండ్ కి తగ్గా లభ్యత లేకపోవడం వల్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.

గతంతో పోలిస్తే వంట నూనెల దిగుమతి ఇప్పుడు స్వల్పంగా తగ్గిందని.. సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది. నవంబర్ 2023 నుంచి జూలై 2024 మార్కెటింగ్ ఏడాదిలో వంటనూనెల దిగుమతులు స్వల్పంగా తగ్గాయని ఎస్ఈఏ తెలిపింది. 2023-24 మార్కెటింగ్ ఏడాదిలో మొదటి తొమ్మిది నెలల్లో వంటనూనెలు దిగుమతులు 1.6 శాతం తగ్గాయి. దీంతో వంటనూనెల దిగుమతులు 1,19,35,227 టన్నులకు చేరుకున్నాయి. 2022-23 మార్కెటింగ్ ఏడాదిలో దిగుమతి చేసుకున్న వంటనూనె 1,21,22,711 టన్నులుగా ఉంది. వంటనూనెల మార్కెటింగ్ ఏడాది నవంబర్ నుంచి అక్టోబర్ వరకూ ఉంటుంది. విదేశాల నుంచి 50 శాతానికి పైగా వంటనూనెలు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి.

ఇక నాన్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులు కూడా 1,32,242 టన్నుల నుంచి 1,88,955 టన్నులకు పెరిగాయి. మార్కెటింగ్ ఏడాది మొదలైన తొమ్మిది నెలల్లో తినదగిన నూనెలు, తినదగని నూనెలు కలిపి మొత్తం 121.24 లక్షల టన్నులు దిగుమతి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గింది. గత మార్కెటింగ్ ఏడాదిలో 122.55 లక్షల టన్నులుగా ఉంటే ఈ ఏడాది 121.24 లక్షల టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది. 2023-24 ఆయిల్ మార్కెటింగ్ ఏడాదిలో తొలి తొమ్మిది నెలల్లో భారత్ 15,18,671 టన్నుల శుద్ధి చేసిన ఎడిబుల్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంది. గతంలో ఇదే మార్కెటింగ్ ఏడాదిలో దిగుమతి చేసుకున్న శుద్ధి చేసిన ఎడిబుల్ ఆయిల్ క్వాంటిటీ 16,40,960 టన్నులుగా ఉంది. అంటే గత మార్కెటింగ్ ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 7 శాతం తగ్గిందని ఎస్ఈఏ తెలిపింది.

ముడి ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులు ఒక శాతం తగ్గుదలతో 1,04,16,556 టన్నులకు తగ్గింది. 2023-24 మార్కెటింగ్ ఏడాదిలో తొలి తొమ్మిది నెలల్లో పామాయిల్ దిగుమతులు 4 శాతం తగ్గాయి. దీంతో పామాయిల్ దిగుమతులు 68,45,097 టన్నులకు పడిపోయింది. గత ఆయిల్ మార్కెటింగ్ ఏడాదిలో 71,17,834 టన్నులుగా ఉంది. అయితే వీటికి భిన్నంగా సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ సీడ్ ఆయిల్, కార్న్ ఆయిల్ వంటి సాఫ్ట్ ఆయిల్ దిగుమతులు మాత్రం 50,04,877 టన్నుల నుంచి 50,90,131 టన్నులకు పెరిగాయి. బ్రెజిల్, అర్జెంటీనా నుంచి సోయాబీన్ నూనె.. ఇండోనేషియా, మలేషియా నుంచి ముడి పామాయిల్.. రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా, రొమేనియా దేశాల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. అయితే గత మార్కెటింగ్ ఏడాదితో పోలిస్తే డిమాండ్ కి తగ్గ దిగుమతులు తగ్గిపోవడంతో వంటనూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Show comments