మీ పెట్టుబడి రెట్టింపు కావాలా? సిటీలో ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షల్లో లాభాలు

Shadnagar Land Rates: మీరు భూములపై పెట్టుబడిపెట్టాలనకుంటున్నారా? రెట్టింపు లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే సిటీలోని ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే చాలు అధిక లాభాలు అందుకోవచ్చు.

Shadnagar Land Rates: మీరు భూములపై పెట్టుబడిపెట్టాలనకుంటున్నారా? రెట్టింపు లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే సిటీలోని ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే చాలు అధిక లాభాలు అందుకోవచ్చు.

ఎప్పటికీ విలువ తగ్గని ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక్క భూమి మాత్రమే. రోజు రోజుకు భూమి విలువ పెరుగుతూనే ఉంది. జనాభా పెరుగుతున్న కొద్ది భూమికి డిమాండ్ పెరుగుతున్నది. భవిష్యత్తులో భూముల ధరలు భారీగా పెరిగి లాభాలు ఇచ్చే అవకాశం ఉండడంతో భూములపై పెట్టుబడిపెట్టే వారి సంఖ్య పెరుగుతున్నది. హైదరాబాద్ వంటి నగరాల్లో భూములపై ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలను అందుకోవచ్చంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే దానికంటే భూములపై పెట్టుబడిపెడితే వచ్చే లాభమే ఎక్కువగా ఉంటుంది. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? మీ ఇన్వెస్ట్ మెంట్ రెట్టింపు కావాలని కోరుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే చాలు ఫ్యూచర్ లో రెట్టింపు లాభాలు అందుకోవచ్చు.

హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు క్యూకడుతున్నాయి. నగరంలో కంపెనీలు ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దీంతో దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఈ క్రమంలోనే సిటీలోని భూములకు రెక్కలొస్తున్నాయి. భవిష్యత్తులో ల్యాండ్ ధరలు పెరిగే భూములపై పెట్టుబడిపెట్టాలని మీరు భావిస్తే షాద్ నగర్ ఏరియా బెస్ట్ అంటున్నారు నిపుణులు. సిటీలోని షాద్ నగర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే.. ఫ్యూచర్ లో రెట్టింపు లాభాలు అందుకోవడం పక్కా అంటున్నారు నిపుణులు. షాద్ నగర్ బెంగళూరు హైవే మీద ఉన్న కారణంగా ఇక్కడి భూములకు డిమాండ్ ఉంది.

ఈ ఏరియాలో పోలేపల్లి సెజ్ తో పాటు 3 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తూరు-నందిగామ ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా.. ఈ మూడు ఇండస్ట్రియల్ ఏరియాల్లో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. షాద్ నగర్ లో అమెజాన్ డేటా సెంటర్ రూపొందుతుంది. ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీల ఏర్పాటుతో షాద్ నగర్ ఏరియా పెట్టుబడిదారులకు సిరులు కురిపించనున్నది. అదే విధంగా కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రస్తుతం షాద్ నగర్ లో చదరపు అడుగు 1800 రూపాయలు ఉంది. భవిష్యత్తులో ఈ ధర డబుల్ అయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ ఏరియాలో మీరు 10 లక్షలు పెట్టుబడిపెడితే తక్కువ కాలంలోనే 20 లక్షలు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అంటే షాద్ నగర్ ఏరియాలోని భూములపై పెట్టుబడిపెడితే లక్షల్లో లాభాలు అందుకోవడం పక్కా అంటున్నారు నిపుణులు.

Show comments