Mutual Fund: రోజుకి రూ.30 పెట్టుబడితే.. రూ.3 కోట్ల రాబడి! మీ తలరాత మార్చేసుకునే ప్లాన్!

రోజుకి రూ.30 పెట్టుబడితే.. రూ.3 కోట్ల రాబడి! మీ తలరాత మార్చేసుకునే ప్లాన్!

Mutual Fund: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ పథకంలో రోజుకు 30 పెట్టుబడి పెడితే రూ. 3కోట్లు అందుకోవచ్చు. మీ అదృష్టాన్ని మార్చే స్కీం.

Mutual Fund: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ పథకంలో రోజుకు 30 పెట్టుబడి పెడితే రూ. 3కోట్లు అందుకోవచ్చు. మీ అదృష్టాన్ని మార్చే స్కీం.

ఫ్యూచర్ లో ఆర్థిక కష్టాలు దరిచేరకూడదంటే పొదుపు చేయాలి. ఆ పొదుపును బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ గా మార్చుకోవాలి. పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే రిస్క్ ఉండదు. రిటర్స్న్ తక్కువగా వస్తాయి. అదే స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం భారీ రాబడిని అందుకోవచ్చు. కానీ రిస్క్ చేయాల్సి ఉంటుంది. మరి మీరు కూడా అధిక రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో రోజుకి రూ. 30 పెట్టుబడి పెడితే రూ. 3 కోట్ల రాబడిని అందుకోవచ్చు. దీంతో మీరు కోటీశ్వరులైపోవచ్చు.

జాబ్ చేస్తున్నంత కాలం నెల నెలా శాలరీ వస్తుంది కాబట్టి ఏ లోటు ఉండదు. కానీ పదవీ విరమణ అనంతరం ఇంటి ఖర్చులు, మెడికల్.. ఇలా ప్రతిదానికి డబ్బు అవసరం పడుతుంది. కాబట్టి జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచే ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేస్తే రిటైర్ మెంట్ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లో నెల నెల కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడితే రాబడి కోట్లలో వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో రెండు రకాల పెట్టుబడి అవకాశం ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా నెల నెలా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు.

రోజుకి రూ.30 పెట్టుబడితే.. రూ.3 కోట్ల రాబడి!

20 ఏళ్ల వయసు ఉన్న ఓ వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అవగానే మ్యూచువల్ ఫండ్ సిప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. రోజుకు రూ. 33 అంటే.. నెలకు రూ.1000 చొప్పున సిప్ లో ఇన్వెస్ట్ చేయాలి. రిటైర్మెంట్ వరకు అంటే మరో 40 ఏళ్ల పాటు సిప్ పెట్టుబడి కొనసాగించాలి. అప్పుడు మీ పెట్టుబడి రూ. 4,80,000 అవుతుంది. వార్షిక రిటర్న్స్ 15 శాతం వచ్చినట్లైతే మీరు అందుకునే రిటర్న్స్ రూ. 3,09,23,755 చేతికి అందుతుంది. 40 ఏళ్ల ఇన్వెస్ట్ మెంట్ తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి, రిటర్న్స్ కలుపుకుని మొత్తం 3,14,03,755 వస్తుంది. నెలకు రూ.1000 సిప్ చేస్తూ వెళ్తే 40 ఏళ్లలో ఏకంగా రూ.3 కోట్లకుపైగా రిటర్న్స్ అందుకోవచ్చు.

Show comments