హైదరాబాద్‌లో నాలుగో సిటీతో శ్రీశైలం హైవేకు మహర్దశ.. ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదు

Real Estate Will Grow In This Highway: అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సదుపాయాలతో హైదరాబాద్ లో నాలుగో సిటీని నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనతో ఆ ఏరియాలోనే కాకుండా ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న హైవే ప్రాంతానికి కూడా మహర్దశ పట్టనుంది.

Real Estate Will Grow In This Highway: అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సదుపాయాలతో హైదరాబాద్ లో నాలుగో సిటీని నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనతో ఆ ఏరియాలోనే కాకుండా ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న హైవే ప్రాంతానికి కూడా మహర్దశ పట్టనుంది.

రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో నాలుగు వేల ఎకరాల్లో కొత్త నగరాన్ని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ముచ్చెర్లని నాల్గవ సిటీగా, న్యూయార్క్ సిటీగా డెవలప్ చేస్తామని అన్నారు. స్పోర్ట్స్ హబ్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హెల్త్ టూరిజం హబ్, స్కిల్ యూనివర్సిటీ వంటివి ఏర్పాటు చేస్తామని.. ముచ్చెర్లను అంతర్జాతీయ ప్రమాణాలతో మహా నగరంగా నిర్మిస్తామని అన్నారు. మెట్రో కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు. ముచ్చెర్ల నాల్గవ సిటీకి సంబంధించిన పనులు మొదలైతే ఇక్కడ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముచ్చెర్ల నుంచి గచ్చిబౌలి ఐటీ సెక్టార్, అవుటర్ రింగ్ రోడ్ 60 కి.మీ. దూరంలో ఉంది. గంటలో చేరుకోవచ్చు.

మెట్రో అనుసంధానం వస్తే ప్రయాణం ఇంకా వేగవంతం అవుతుంది. అయితే హైదరాబాద్ కి ముచ్చెర్ల కంటే దగ్గరగా శ్రీశైలం హైవే ఉంది. శ్రీశైలం హైవే ముచ్చెర్లకు 17 కి.మీ. దూరంలో ఉంది. ఇటు గచ్చ్చిబౌలికి 45 కి.మీ. దూరంలో ఉంది. అటు హైదరాబాద్ కి, ఇటు ముచ్చెర్లకి రెండిటికీ దగ్గర్లో ఉంది శ్రీశైలం హైవే. ఐటీ ఉద్యోగులకు శ్రీశైలం హైవే బెస్ట్ అని చెబుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా గానీ, డిస్టెన్స్ పరంగా గానీ తక్కువే అని అంటున్నారు. ముచ్చెర్లలో అభివృద్ధి పనులు మొదలైతే శ్రీశైలం హైవేకి భవిష్యత్తులో మహర్దశ పట్టనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. శ్రీశైలం హైవే మీద చదరపు అడుగు స్థలం సగటున రూ. 1500గా ఉంది. అంటే గజం స్థలం ధర రూ. 13,500గా ఉంది. 27 లక్షలకే 200 గజాల స్థలం దొరుకుతుంది.

ఇదే స్థలం హైదరాబాద్ లో రావాలంటే కోటి రూపాయల పైనే పెట్టుబడి పెట్టాలి. హైదరాబాద్ లో స్థలాల ధరలు పెరిగిపోవడం, వలసలు పెరగడం వంటి వాటి వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో నగరాన్ని విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే ముచ్చెర్లను నాలుగో సిటీగా డెవలప్ చేస్తామని ప్రకటించింది. ఈ నాలుగో సిటీ కనుక పూర్తి స్థాయిలో డెవలప్ అయితే కనుక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంటుంది. శ్రీశైలం హైవేలో ఇప్పుడు చదరపు అడుగు స్థలం 1500గా ఉంటే.. భవిష్యత్తులో 5 వేలు, 7 వేలు పలుకుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో కోట్లు అవుతాయని చెబుతున్నారు.   

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.

Show comments