ITR Filing: ఈ నెలాఖరు లోపు ఈ పని చేయకపోతే వెయ్యి నుంచి 5 వేలు పెనాల్టీ!

ఈ నెలాఖరు లోపు ఈ పని చేయకపోతే వెయ్యి నుంచి 5 వేలు పెనాల్టీ!

ITR Filing: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఈ నెలాఖరులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయలు పెనాల్టీ పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ పని చేయండి.

ITR Filing: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఈ నెలాఖరులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయలు పెనాల్టీ పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ పని చేయండి.

అకౌంట్లు ఆడిట్ అవసరం లేని పర్సనల్ ట్యాక్స్ పేయర్లు.. గడువు తేదీ లోపు గత ఆర్థిక ఏడాది 2023-24కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు తేదీ లోపు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే భారీగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పెనాల్టీ అనేది అందరి మీద పడదు. ఈ విషయంలో ఆదాయపు పన్ను చట్టం కొంతమంది పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు ఇస్తుంది. ఎవరికి పెనాల్టీలు పడవు, ఎవరికి పెనాల్టీలు పడతాయి?

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం.. గడువు తేదీ ముగిసిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే బిలేటెడ్ ఐటీఆర్ అంటారు. ఈ సెక్షన్ ప్రకారం.. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే 5 వేల వరకూ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రం ఈ పెనాల్టీ అనేది వెయ్యి లోపు ఉంటుంది. పన్ను బకాయిలు లేనప్పటికీ కూడా పెనాల్టీ అనేది చెల్లించాలి. ఇంకో విషయం ఏంటంటే.. ఐటీఆర్ ఫామ్ లో పేర్కొన్న దాని ప్రకారం లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించినట్లు చలానా వివరాలు అందిన తర్వాతే బిలేటెడ్ ఐటీఆర్ అనేది ప్రాసెసింగ్ అవుతుంది. పన్ను మినహాయింపు లిమిట్ ని మించి ఆదాయం ఉన్న ట్యాక్స్ పేయర్స్ గడువు తేదీ లోపు ఐటీఆర్ ఫైల్ చేయనివారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పెనాల్టీ ఛార్జీలు అనేవి పడతాయి.

కొత్త పన్ను విధానం ప్రకారం.. 3 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. 3 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే కనుక పెనాల్టీలు చెల్లించాల్సిందే. పాత పన్ను విధానం ప్రకారం.. 2.5 లక్షల లోపు పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను పరిమితికి లోబడి ఆదాయం ఉన్నా కూడా సెక్షన్ 139(1) వస్తే కనుక పెనాల్టీ అనేది పడుతుంది. విదేశీ ఆస్తులు ఉన్న వారు ఎవరైనా గడువు తేదీ లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదంటే పెనాల్టీ కట్టాల్సిందే. అయితే పన్ను పరిమితి లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేయకుండా గడువు తేదీ తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా గానీ పెనాల్టీలు అనేవి పడవు. పన్ను పరిధిలో లేకున్నా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడాన్ని నిల్ ఐటీఆర్ అంటారు. ఇలాంటి వాళ్ళు గడువు తేదీతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానం ప్రకారం 7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. పన్ను పరిమితి 3 లక్షల వరకూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు నిల్ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

Show comments