KIA EV9: కియా నుంచి భారీ ఎలక్ట్రిక్ SUV! ఫీచర్స్ అదిరాయి!

Kia EV9: సౌత్ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది. తనదైన స్టైల్లో మార్కెట్‌లో కార్లను విడుదల చేస్తూ ప్రజల ఆదరణ పొందింది.

Kia EV9: సౌత్ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది. తనదైన స్టైల్లో మార్కెట్‌లో కార్లను విడుదల చేస్తూ ప్రజల ఆదరణ పొందింది.

సౌత్ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది. తనదైన స్టైల్లో మార్కెట్‌లో కార్లను విడుదల చేస్తూ ప్రజల ఆదరణ పొందింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన సెల్టోస్, సోనెట్, కరెన్స్ ఇంకా కార్నివాల్ వంటి మోడళ్లు బాగా పాపులర్ అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల ప్రొడక్షన్స్ లోనూ కియా కంపెనీ ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతుంది. ఇప్పటికే కియా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్‌ కారు ఈవీ6 మార్కెట్‌లో దుమ్మురేపుతుంది. ఇది ప్రీమియం మోడల్ అయినా కానీ జనాలు కొనడానికి ఇష్టపడుతున్నారు. కియా ఇప్పుడు దేశంలో తన రెండవ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయాలని ప్లానింగ్లో ఉంది. ఈ కార్ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మార్కెట్లోకి రానుంది.ఈ ఎలక్ట్రిక్ కారు పేరు ఈవీ9 (Kia EV9). దీనిని అక్టోబర్‌ 3, 2024న ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు కియా కంపెనీ వెల్లడించింది. ఈ కార్ సూపర్ డిజైన్ తో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ పండుగ సీజన్‌లో చాలా గ్రాండ్ గా విడుదల అయ్యే కార్ గా కియా ఈవీ9 నిలువబోతుంది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ హ్యుందాయ్ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ (E-GMPO) ఆధారంగా మ్యానుఫాక్చర్ అయ్యింది. ఇది కంప్లీట్ గా విదేశాల్లో తయారైన సీబీయూ కార్ గా ఇండియాలో లాంచ్ కానుంది. ఈ కార్ కంప్లీట్‌ బిల్ట్ అప్ యూనిట్ కావడంతో, దీని ధర సుమారు రూ.80 లక్షలకు మించి ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఈ కార్ షేప్ కూడా భారీగా ఉంటుందట. ఈ కార్ 5,015 mm పొడవు, 1,980 mm వెడల్పు, 1,780 mm ఎత్తుని కలిగి ఉంది. అలాగే 3,100 mm వీల్‌బేస్‌ కలిగి కియా ఈవీ9 వేరే కార్లకంటే అతిపెద్ద డిజైన్‌లో రానుంది. ఈ కార్ ఎక్కువ స్పేస్‌ కలిగి 7 మంది సౌకర్యంగా కూర్చొగలిగేలా ఉండనుందని తెలుస్తుంది.

ఈ కార్ ఎక్స్‌టీరియర్‌ విషయానికి వస్తే.. ‘డిజిటల్ టైగర్ ఫేస్’ అనే సిగ్నేచర్ స్టైలింగ్, చిన్న క్యూబ్ ల్యాంప్స్, డిజిటల్ ప్యాటర్న్ లైటింగ్ గ్రిల్, వర్టికల్ హెడ్‌ల్యాంప్స్, స్పెషల్ ‘స్టార్ మ్యాప్’ LED డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. దీనిలో పాలీగోనల్ వీల్‌ఆర్చ్‌లు, 21 ఇంచెస్‌ స్పోర్టీ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో డోర్ మౌంటెడ్ ORVMలు ఉంటాయి. ఇక దీని ఇంటీరియర్ విషయానికి వస్తే, వరల్డ్‌ క్లాస్ బెస్ట్ ఇంటీరియర్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులో నావిగేషన్‌తో కూడిన 12.3 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్‌ డ్రైవర్ డిస్ ప్లే స్క్రీన్, 5.3 అంగుళాల త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్, డిజిటల్ కీ, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, USB-C పోర్ట్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఆటోమేటిక్ డిఫాగ్‌ సిస్టమ్, ఫుల్ డిస్ ప్లేతో కూడిన ఎలక్ట్రానిక్ రియర్ వ్యూ మిర్రర్, హీటెడ్ స్టీరింగ్ వీల్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ప్యాడిల్ షిఫ్టర్స్‌, స్మార్ట్ పవర్‌టెయిల్ గేట్‌ ఇందులో ఉండనున్నాయి. దీనికి 99.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అందుకే ఒక్కసారి ఛార్జ్ చేస్తే లీటరుకు ఏకంగా 541 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పైగా ఇది పోర్టబుల్ ఛార్జింగ్ ఆప్షన్‌తో వస్తుంది. అల్ట్రా-ఫాస్ట్ 800V ఛార్జింగ్‌ని కలిగి ఉన్న ఈ కార్ కేవలం 15 నిమిషాల్లో 239 కిలోమీటర్ల రేంజ్‌ అందించగలదు. ఇందులో హైవే డ్రైవింగ్ పైలట్ ఫీచర్ కూడా ఉందని తెలుస్తుంది. ఇది హైవేలపై హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ని అనుమతించే Level 3 ADAS టెక్నాలజీ. అయితే ఈ కార్ ఈ టెక్నాలజీతో ఇండియాలో లాంచ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ కార్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Show comments